బిగ్ బాస్ సీజన్ 5 పదకొండు వారలు పూర్తి చేసుకుని పన్నెండో వారంలోకి అడుగుపెట్టబోతుంది. ఈ వారం బిగ్ బాస్ నామిషన్స్ లో వారికి ఓ అవకాశం ఇస్తూ ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ ఇవ్వడంతో.. ఇంటి సభ్యులందరూ తమ తమ కారణాలతో కాలిపోగా.. చివరికి ఈ ఎవిక్షన్ పాస్ సన్నీ దక్కించుకున్నాడు. ఇక ఈ రోజు శనివారం కావడంతో.. నాగార్జున ఎపిసోడ్ వచ్చేసింది. ప్రతి శనివారంలాగే.. ఈ వారం కూడా హౌస్ మేట్స్ నాగ్ ఇచ్చే క్లాస్ కి రెడీ అవ్వగా.. సిరిని పైకి లేపిన నాగ్.. వై ఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్, ఇలాంటి పరిస్థితి హౌస్ లో అవసరమా? ఎందుకు చేసావ్? ఏం జరుగుతుంది? అని నాగార్జున సిరిని స్పెషల్ గా కన్ఫెషన్ రూమ్ కి పిలిచి మరీ అడిగారు.
దానికి సిరి.. ఏమో సర్ ఏం జరుగుతుందో.. నాకు కూడా క్లారిటీ లేదు, కోట్లమంది నిన్ను చూసి ఎలా ఉండాలో నేర్చుకోవాలి, అయ్యో ఇలా ఉండకూడదు అని నేర్చుకోకూడదు అని నాగ్ అనగానే.. నా స్టోరీ నాకు తెలుసు, బయట నేనేమిటో నాకు తెలుసు. స్టిల్ ఎందుకు కనెక్షన్ వస్తుందో నాకు తెలియడం లేదు అని ఏడ్చేసింది. ఇక నాగ్ షణ్ముఖ్ ని కూడా కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి ఏంటి షన్ను అనగానే.. ఏమో సర్ మెంటల్లీ వీక్ అయ్యాను సర్. ఏంటి దీప్తిని అంత మిస్ అవుతున్నావా? చాలా మిస్ అవుతున్నాను సర్. వెంటనే నాగర్జున ప్లీజ్ బిగ్ బాస్ ఓపెన్ ద గేట్స్ అనగానే గేట్స్ ఓపెన్ అయ్యాయి.. దానితో హౌస్ మేట్స్ షాక్.. నీ కోసం గేట్స్ ఓపెన్ అయ్యాయి.. దీప్తిని మిస్ అవుతుంటే.. ఈ క్షణమే వెళ్ళిపో అని షణ్ణుకి షాకిచ్చాడు నాగ్.