ఏపీ అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు భార్య, సీనియర్ ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరి కి జరిగిన అవమానానికి నందమూరి ఫ్యామిలీ మొత్తం బాలకృష్ణ అధ్యక్షతన ప్రెస్ మీట్ పెట్టి.. మహిళలని కించపరచడం బాధాకరమని, మా ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ అండ్ కల్యాణ్ రామ్ లు కనిపించలేదు కానీ.. కళ్యాణ్ రామ్ సోషల్ మీడియా వేదికగా..
అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పాటు పడే దేవాలయం వంటిది. అక్కడ చాలా మంది మేధావులు, చదువుకున్నవారు ఉంటారు. అలాంటి ఓ గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది ఎంతో బాధాకరం. ఇది సరైన విధానం కాదు. సాటి వ్యక్తిని, ముఖ్యంగా మహిళలను గౌరవించే మన సంప్రదాయంలో మహిళలను అసెంబ్లీలో అకారణంగా దూషించే పరిస్థితి ఎదురుకావడం దురదృష్టకరం. అందరూ హుందాగా నడుచుకోవాలని మనవి చేసుకుంటున్నాను.
यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः ।
यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः ।।
Where women are worshiped, divinity blossoms there. Wherever they are not worshiped, all actions result in failure.
పూజ్యులు తాతగారు రామా రావు గారు మహిళలకు ఇచ్చిన గౌరవాన్ని ఒక్క సారి గుర్తుచేసుకుందాము.. అంటూ ట్వీట్ చేసారు.