నిన్న ఏపీ అసెంబ్లీలో సీనియర్ ఎన్టీఆర్ కుమర్తె, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరిని వైసిపి మంత్రులు అవమానకర రీతిలో మట్లాడడంతో.. భార్య ని తన ముందే అవమానించడంపై టిడిపి అధ్యక్షడు చంద్రబాబు నాయుడు మీడియా ఎదుట భోరున విలపించారు.. భువనేశ్వరి విషయాన్ని పలువురు పొలిటికల్, సినిమా ప్రముఖులు ఖండించారు. అయితే నందమూరి ఫ్యామిలీ మాత్రం నిన్న జరిగిన ఈ సంఘటన తర్వాత కాస్త సైలెంట్ గానే ఉంది. కానీ ఈ రోజు బాలకృష్ణ తన సోదరి భువనేశ్వరిని అవమానించిన విషయంపై తన ఫ్యామిలీ అంటే నందమూరి ఫ్యామిలీతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. సోదరులు, భార్య వసుందర ఇంకా పలువురు ఫ్యామిలీ మెంబెర్స్ తో మీడియాతో మాట్లాడారు.
ఎంతో దైర్యంగా ఉండే చంద్రబాబు కన్నీళ్లు పెట్టడం ఎప్పుడూ చూడలేదు అని, అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు సరికావు అని, సజావుగా జరగాల్సిన సభ వ్యక్తిగత దూషణలకు నెలవు అయ్యింది అని, అసెంబ్లీలో సవాళ్లు, ప్రతి సవాళ్లు ఆనవాయితీనే, హుందాగా నడవాల్సిన సభలో కేరెక్టర్ అస్సాసిసేషన్ చెయ్యడం సరికాదు, ఓ ఆడపడుచుని అవమానించడం బాధాకరం, నా సోదరి భువనేశ్వరి, చంద్రబాబు భార్య ని అవమానించడం సహించలేము. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన సభలో ఇలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు అనేది కరెక్ట్ కాదు, గొడ్ల చావిట్లో ఉన్నామా.. అసెంబ్లీలో ఉన్నామా.. అనే అనుమానం కలుగుతుంది. పర్సనల్ ఎజెండాతోనే మా కుటుంబాన్ని అవమానించారు. ఇక ఎవ్వడు నోరెత్తినా సరే ఊరుకోము అని బాలయ్య వార్నింగ్ ఇచ్చారు.
మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తాం. మేము చేతులు కట్టుకుని కూర్చోలేదు. ఎవరైనా నోరు అదుపు తప్పి మాట్లాడితే ఊరుకోము. స్పీకర్ అసెంబ్లీలో ప్రభుత్వ పక్షం వహిస్తున్నారు... చంద్రబాబు నాయుడు అనుమతి అవసరం లేదు మాకు మాట్లాడడానికి.. మా కుటుంబం తరపు నుండి, ఫాన్స్ తరపు నుండి.. మళ్ళీ ఒకవేళ ఇలాంటి కూతలు కూస్తే.. సహించం.. మీ భరతం పడతాం.. ఖబడ్డార్ అంటూ బాలకృష్ణ ఈ ప్రెస్ మీట్ లో సోదరిపై జరిగిన అవమానం పై మాట్లాడారు.