నాగార్జున - కళ్యాణ్ కృష్ణ కాంబోలో సోగ్గాడే చిన్నినాయనా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో.. దానికి సీక్వెల్ గా నాగ్ - కళ్యాణ్ కృష్ణ లు బంగార్రాజు సినిమాని పట్టాలెక్కించడానికి మూడేళ్లు పట్టినా.. బంగార్రాజు మొదలు కావడమే.. శర వేగంగా షూటింగ్ ని చుట్టేస్తున్నారు. సినిమా మొదలైన రెండు నెలల లోపే.. నాగ్ లుక్, రమ్యకృష్ణ లుక్, రీసెంట్ గా నాగలక్ష్మి గా కృతి శెట్టి లుక్స్ రివీల్ చేసిన.. బంగార్రాజు టీం.. ఇప్పుడు టీజర్ కి ముహూర్తం పెట్టేసారు. అంతేకాదు బంగార్రాజు ఫస్ట్ లుక్ ని నవంబర్ 22 న రివీల్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.
అంతేకాదు.. నవంబర్ 23 న బంగార్రాజు టీజర్ కూడా రెడీ అంటున్నారు. మరి షూటింగ్ మొదలు పెట్టిందే నిన్నగాక మొన్న.. అప్పుడే ఏంది ఈ జోరు. బంగార్రాజు నుండి ఇన్ని అప్ డేట్స్ వరసగా వచ్చేసరికి.. వాసివాడి తస్సాద్దియ్యా.. ఏందయ్యా ఆ స్పీడు అంటున్నారు అక్కినేని ఫాన్స్. మరి ఇదే స్పీడు తో బంగార్రాజు సంక్రాతి బరిలోకి వచ్చెయ్యడం ఖాయమే అన్న మాట ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. క్రేజీ ఫిలిం గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య కీ రోల్ పోషిస్తున్నాడు. ఆయనకి జోడిగా కృతి శెట్టి నటిస్తుంది.