నిన్న ఏపీ అసెంబ్లీలో టిడిపి అధ్యక్షుడు, సీనియర్ ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు భార్య భువనేశ్వరి ని వైసీపీ మంత్రులు ఘోరంగా అవమానించడంతో.. చంద్రబాబు నాయుడు మీడియా ఎదుటే వెక్కి వెక్కి ఏడ్చారు. తన భార్య ఇంతవరకు రాజకీయాల్లోకి రాకపోయినా.. ఆమెని ఘోరంగా అవమానించారు అంటూ చంద్రబాబు కళ్ళ నీళ్లు పెట్టుకోగా.. ఆయనకి అండగా.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఇంకా బిజెపి నేతలు, సినిమా ఇండస్ట్రీ నుండి అశ్విని దత్, కె. రాఘవేంద్రరావు లాంటి ప్రముఖులు నిలబడ్డారు. ఆఖరికి బిజెపి నేత, భువనేశ్వరి సోదరి పురందరేశ్వరి కూడా సోదరి కి అండగా నిలవగా.. తన సోదరిని ఏపీ అసెంబ్లీలో అంత మాట అన్న వైసీపీ మంత్రులపై హిందూపూర్ ఎమ్యెల్యే, స్టార్ హీరో బాలకృష్ణ స్పందించకపోవడం ఎవరికి అర్ధం కావడం లేదు.
బాలకృష్ణ తన సోదరి పై వైసీపీ చేసిన వ్యాఖ్యలను ఖండించలేదు.. మరోపక్క యంగ్ హీరోలైన ఎన్టీఆర్ కానీ, కళ్యాణ్ రామ్ లు కానీ.. ఈ విషయమై నోరు మెదపకపోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రాజకీయంగా ఇలాంటి మాటలు వచ్చినా.. ఫ్యామిలీ పరంగా భువనేశ్వరికి సపోర్ట్ చెయ్యాల్సిన బాధ్యత బాలకృష్ణ కి, ఎన్టీఆర్ కి, కళ్యాణ్ రామ్ లకి లేదా.. అసలు వీరంతా ఎక్కడున్నారయ్యా అంటూ నందమూరి ఫాన్స్ కూడా మాట్లాడుతున్నారు అంటే.. పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. అదే హరికృష్ణ బ్రతికి ఉంటే.. ఇలా ఊరుకునేవాడా.. ఈపాటికి వైసీపీ మంత్రులకి చమటలు పట్టించేవాడు అంటూ సోషల్ మీడియాలో ఫాన్స్ మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా నారా భువనేశ్వరికి జరిగిన ఈ అవమానంపై బాలయ్య కానీ, ఎన్టీఆర్ కానీ, కళ్యాణ్ రామ్ కానీ స్పందించాల్సింది.. కానీ సైలెంట్ గా ఉండిపోయారు.. ఇప్పుడు అదే ఫాన్స్ కి మింగుడు పడడం లేదు.