ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా మార్కెట్ ని టచ్ చెయ్యడానికి రెడీగా ఉన్నాడు. మధ్యలో బుల్లితెర జెమినీ ఛానల్ ద్వారా ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. ఈమధ్యనే కోటి రూపాయల ప్రశ్నతో ఈ షో పై అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసిన ఎన్టీఆర్.. ఎవరు మీలో కోటీశ్వరులు షో స్టార్టింగ్ లోనే స్పెషల్ గెస్ట్ గా రామ్ చరణ్ వచ్చాడు.. ఆ ఎపిసోడ్ ని బుల్లితెర ప్రేక్షకులు ఎంజాయ్ చేసారు. తర్వాత రాజమౌళి, కొరటాల వచ్చారు. ఆ తర్వాత స్పెషల్ సెలెబ్రిటీ గెస్ట్ గా సమంత వచ్చిన ఎపిసోడ్ బాగా ఎక్కేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ షో కి నారదుడు - తుంబరుడు అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ థమన్, దేవిశ్రీలు వచ్చారు.. ఆ పై మహేష్ ఎన్టీఆర్ షో కి వచ్చాడని ప్రచారం జరిగినా.. ఇంతవరకు జెమినీ నుండి ఎలాంటి అప్ డేట్ లేదు.
ఇటు చూస్తే ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరులు ఫస్ట్ సీజన్ కంప్లీట్ చేసేసాడు.. అంటే లాస్ట్ ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ ఎన్టీఆర్ కాంబో ఎపిసోడ్ వస్తుందేమో అనే ఊహాగానాలు నడుస్తున్నాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ - మహేష్ కలయికలో తెరకెక్కిన ఎవరు మీలో కోటీశ్వరులు సెలెబ్రిటీ ఎపిసోడ్ కి డేట్ ఫిక్స్ చెయ్యకపోయినా.. త్వరలోనే అంటూ మహేష్ - ఎన్టీఆర్ పిక్ తో అప్ డేట్ ఇచ్చారు. Evaru Meelo Koteeswarulu | Gemini TV Get ready to watch the episode of the decade soon on Gemini TV. #EMKbyNTRonGeminiTV #EvaruMeeloKoteeswaruluOnGeminiTV #EvaruMeeloKoteeswarulu #NTR #MaheshBabu అంటూ అప్ డేట్ వచ్చేసింది. మరి సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాటతో ఏప్రిల్ ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. మరి ఇప్పుడు ఎన్టీఆర్ షో ద్వారా బుల్లితెర మీద సందడి చెయ్యడానికి రెడీ అయ్యాడు. మరి ఎన్టీఆర్ - మహేష్ చేసే అల్లరి, సందడి తో బుల్లితెర బ్లాస్ట్ అవడం ఖాయం అంటున్నారు మహేష్ అండ్ ఎన్టీఆర్ ఫాన్స్.