అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై థ్రిల్లర్ ఏజెంట్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చాలా స్పీడు గా జరుగుతుంది. కాకినాడ, వైజాగ్ పోర్ట్ లలో కీలక సన్నివేశాల చిత్రీకరణ తర్వాత ఈ మధ్యనే అఖిల్ అండ్ సురేందర్ రెడ్డి ఇంకా ఏజెంట్ టీం యూరప్ షెడ్యూల్ పూర్తి చేసుకుని రీసెంట్ గానే హైదరాబాద్ కి తిరిగివచ్చింది. అయితే యూరప్ నుండి వచ్చాక సురేందర్ రెడ్డి కరోనా టెస్ట్ చేయించుకోగా ఆయనకి కరోనా పాజిటివ్ అని తేలడంతో... ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లోనే ఉండి.. కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది.
సురేందర్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవడంతో ఏజెంట్ షూటింగ్ కి బ్రేకులు వేశారు. సురేందర్ రెడ్డి కరోనా నుండి కోలుకున్నాకే మళ్ళీ ఏజెంట్ మూవీ షూటింగ్ మొదలు పెడతారని, ఈసారి ఏజెంట్ షెడ్యూల్ హైదరాబాద్ లోనే ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక అఖిల్ రా ఏజెంట్ గా కనిపించనున్న ఈ సినిమా కోసం పూర్తి మేకోవర్ తో మాస్ అఖిల్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ కి జోడిగా కొత్త హీరోయిన్ సాక్షి వైద్య నటిస్తుండగా.. మలయాళ ప్రముఖ నటుడు మమ్ముట్టి కీలకపాత్రలో నటించబోతున్నారు.