Advertisementt

నయనతార కావాలంటే ఆ రేంజ్ ఉండాల్సిందే

Fri 19th Nov 2021 07:54 PM
nayanthara,nayan demands huge remuneration,mohan raja,chiranjeevi,chiru godfather,godfather movie,lucifer remake  నయనతార కావాలంటే ఆ రేంజ్ ఉండాల్సిందే
Nayanthara demands huge remuneratio నయనతార కావాలంటే ఆ రేంజ్ ఉండాల్సిందే
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరు కి చెల్లెలి గా ఓ లేడీ సూపర్ స్టార్ నటించడం అంటే ఆ సినిమాకి ఎంత క్రేజ్, ఎన్ని అంచనాలు ఉంటాయి. ఇప్పుడు చిరంజీవి - మోహన్ రాజా కాంబోలో తెరకెక్కుతున్న మలయాళ రీమేక్ గాడ్ ఫాదర్ పై అన్నే అంచనాలు, అంతే క్రేజ్ ఉంది. కారణం చిరంజీవి కి పవర్ ఫుల్ సిస్టర్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించడమే. నిన్న మొన్నటివరకు ఉన్న ఊహాగానాలను ఒకే ఒక్క బర్త్ డే విషెస్ తో పటాపంచలు చేసి.. గాడ్ ఫాదర్ పై అంచనాలు మరింతగా పెంచేశారు మేకర్స్. మరి క్రేజీ హీరోయిన్.. ఓ స్టార్ హీరోయిన్ చెల్లెలు గా నటిస్తుంది అంటే అలానే ఉంటుంది. మరి ఫలితంగా భారీ రెన్యుమరేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది.

ఇప్పుడు నయనతారని ఒప్పించడానికి గాడ్ ఫాదర్ మేకర్స్ అదే చేసారు. సహజంగానే చిరు సినిమా అంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి.. ఇప్పుడు నయనతార ఆ సినిమాలో అందులోనూ చిరు చెల్లెలిగా అంటే.. ఆ క్రేజు, ఆ రేంజ్ మాములుగా ఉండదు. అందుకే నయనతార కి ఏకంగా హైయ్యెస్ట్ పారితోషకం కింద దాదాపుగా 4 కోట్లు ముట్టజెబుతున్నారట గాడ్ ఫాదర్ మేకర్స్. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ లో కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న నయనతార కేరెక్టర్ సినిమాకి చాలా కీలం. కాబట్టి నయనతార ఆ కేరెక్టర్ చెయ్యడానికి ఒప్పుకుంది.. అది కూడా నాలుగు కోట్ల పారితోషకాని.. ఇప్పడు ఇదే కోలీవుడ్, టాలీవుడ్ లలో హాట్ టాపిక్. 

Nayanthara demands huge remuneratio:

Nayanthara demands huge remuneration for Chiru GodFather

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ