బాలకృష్ణ - బోయపాటి కాంబోలో తెరకెక్కిన అఖండ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది. డిసెంబర్ 2 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. బాలయ్య అఘోరాగా, యంగ్ కేరెక్టర్ లో అదరగొట్టేస్తున్నారు. అఖండ ట్రైలర్ తోనే సినిమాపై భీభత్సమైన అంచనాలు పెరిగిపోగా.. ఇప్పుడొక న్యూస్ ఫాన్స్ ని షేక్ చేస్తుంది. అది వైజాగ్ లో జరగబోయే అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలయ్య నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం వెళ్ళినట్లుగా చెప్పుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆహ్వానించారని, ఎన్టీఆర్ తో పాటుగా.. నేచురల్ స్టార్ నాని కి కూడా బాలయ్య నుండి ఇన్విటేషన్ వెళ్ళినట్లుగా తెలుస్తుంది.
మరి అఖండ కోసం నందమూరి అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అందరికి తెలుసు.. అలాంటి అఖండ కోసం పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ రంగంలోకి దిగడం, అలాగే నాని కూడా అఖండ ఈవెంట్ కి వస్తున్నాడని తెలిసి నందమూరి అభిమానులు సంతోషం పట్టలేకపోతున్నారు. ఈ నెల 27 న కానీ 28 న కానీ వైజాగ్ లో అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారని అంటున్నారు.. దీనికి సంబందించిన మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.