బిగ్ బాస్ 5: ఈ వారం ఆ ఇద్దరూ డేంజర్ లో

బిగ్ బాస్ సీజన్ 5 11 వారంలో ఏకంగా ఎనిమిదిమంది నామినేషన్స్ లో ఉన్నారు. కేవలం కెప్టెన్ రవి తప్ప మిగతా వారంతా నామినేషన్స్ లోకి వెళ్లారు. షణ్ముఖ్, సిరి, మానస్, సన్నీ, అని మాస్టర్, ప్రియాంక, కాజల్ లు నామినేషన్స్ లో ఉన్నారు. గత వారం మానస్ - కాజల్ లు డేంజర్ జోన్ లోకి వెళ్లగా జెస్సి వాళ్ళని సేవ్ చేసాడు. ఇక ఈ వారం ఇద్దరు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా అని మాస్టర్ కి ఓట్లు పరంగా చాలా తక్కువ ఓట్స్ పడుతున్నాయని అంటున్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చనే ఊహాగానాలు మొదలైపోయాయి.
ఆలా అయితే ప్రియాంక - అని మాస్టర్ ఇద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ప్రియాంక మానస్ ని అడ్డం పెట్టుకుని గేమ్ ఆడుతూ ఇప్పటివరకు బండి లాగించేసింది. ఇక అని మాస్టర్ గ్రూప్స్, ఫ్రెండ్ షిప్ లు, బ్యాచ్ లు అంటూ నోరేసుకుని పడిపోయి ఇప్పటివరకు నెట్టేసింది. సో ఈ వారం ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.
Bigg Boss Telugu 5: Contestants in Danger Zone
Bigg Boss 5: 2 Contestants in Danger Zone





































