Advertisementt

సమంతపై జరుగుతున్న ప్రచారం అంతా..

Fri 19th Nov 2021 09:27 AM
samantha,samantha remuneration strategy,pushpa special song,telugu,tamil movies,samantha new movie  సమంతపై జరుగుతున్న ప్రచారం అంతా..
Samantha Remuneration rumours సమంతపై జరుగుతున్న ప్రచారం అంతా..
Advertisement
Ads by CJ

ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే.. అది సమంత పుష్ప లో చెయ్యబోయే స్పెషల్ సాంగ్ గురించే. ఫస్ట్ టైం సమంత స్పెషల్ సాంగ్ చెయ్యడం ఓ టాపిక్ అయితే.. ఈ సాంగ్ కోసం సమంత ఏకంగా 1.5 కోట్ల నుండి 2 కోట్ల పారితోషకం వసూలు చెయ్యడమే కాకుండా.. సుకుమార్ కి బోలెడన్ని కండిషన్స్ పెట్టింది అంటూ రకరకాల న్యూస్ లు ప్రచారం లోకి వచ్చాయి. అయితే సమంత పుష్ప లో అల్లు అర్జున్ సరసన చేస్తున్న స్పెషల్ సాంగ్ కోసం ఎలాంటి డిమాండ్ చెయ్యలేదని, అలాగే సుకుమార్ కి ఎలాంటి కండిషన్స్ పెట్టలేదని తెలుస్తుంది.

అసలు సమంత కి పుష్ప మేకర్స్ 30 నుండి 40 లక్షలు మాత్రమే ముట్టజెప్పారని అంటున్నారు. అంటే సమంత పై జరుగుతున్న ప్రచారం అంతా జస్ట్ రూమరే అని.. పారితోషకం విషయం మాత్రం కావాలని కల్పించి ప్రచారం చేస్తున్నారనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తుంది. అంటే డివోర్స్ తీసుకున్న సమంత క్రేజ్ ఇది, సమంత రేంజ్ ఇది అన్నట్టుగా ఆమె ని పారితోషకం విషయంలో కావాలనే కొంతమంది హైలెట్ చేస్తున్నారంటున్నారు. సమంత ని ఇలా హైలెట్ చెయ్యడం వలన ఆమె కి మరిన్ని ఆఫర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా.. అందుకే ఇలా చేస్తున్నారేమో అంటూ నెటిజెన్స్ విమర్శిస్తున్నారు. 

Samantha Remuneration rumours:

samantha Remuneration Strategy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ