Advertisementt

అలా మొదలైన ఆర్.ఆర్.ఆర్

Thu 18th Nov 2021 09:39 PM
rrr,ram charan,rama rao,rajamouli,rrr pan india movie,rrr announcement 4 years  అలా మొదలైన ఆర్.ఆర్.ఆర్
RRR marks 4 years of announcement date today అలా మొదలైన ఆర్.ఆర్.ఆర్
Advertisement
Ads by CJ

బాహుబలి తో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ సృష్టించిన రాజమౌళి.. తన తదుపరి మూవీ ఎవరితో చేస్తారా? ఎలాంటి బ్యాగ్డ్రాప్ లో చేస్తారా? అని ఆలోచిస్తున్న ప్రేక్షకులకి షాక్ ఇస్తూ ఓ రోజు అంటే నవంబర్ 18, 2017 నైట్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో రాజమౌళి ఉన్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసారు రాజమౌళి. బాహుబలి తర్వాత ఎలాంటి ఊహాగానాలు, ఎలాంటి రూమర్స్ లేకుండా రామారావు - రామ్ చరణ్ - రాజమౌళి ల కాంబోలో మూవీ ఉండబోతుంది అని తెలియగానే.. టాలీవుడ్ మాత్రమే కాదు.. అన్ని భాషల ఇండస్ట్రీ ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యారు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఫాన్స్ అయితే పండగ చేసుకున్నారు.

బాహుబలి క్రేజ్ తో బాలీవుడ్ లో పాగా వేస్తారు రాజమౌళి అనుకున్న టైం లో నందమూరి - మెగా కాంపౌండ్ హీరోలని ఒకే స్క్రీన్ మీద చూపించడానికి రాజమౌళి గ్రౌండ్ వర్క్ పూర్తి చేసి ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేసారు. స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యాలని టాప్ డైరెక్టర్స్ తిరుగుతున్న రోజుల్లో.. తన చుట్టూ హీరోలని తిప్పుకునే రాజమౌళి.. పాన్ ఇండియా లెవల్లో ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో ఆర్.ఆర్.ఆర్ కి శ్రీకారం చుట్టి నవంబర్ 18 న ఒకే ఒక్క పిక్ తో సోషల్ మీడియానే కాదు ఇండస్ట్రీలోని అందరిని షేక్ చేసి పడేసారు.. అలా నాలుగేళ్ళ క్రితం ఆర్.ఆర్.ఆర్ ఒకే ఒక్క పిక్ తో అద్భుతాన్ని సృష్టించింది.. ఇక కొన్ని టెక్నీకల్ రీజన్స్, అనుకోకుండా వచ్చిన కరోనా కారణంగా ఆర్.ఆర్..ఆర్ మూవీ మూడుసార్లు రిలీజ్ డేట్స్ మార్చుకుని ఫైనల్ గా జనవరి 7, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. 

RRR marks 4 years of announcement date today:

RRR marks its announcement 4 years ago today

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ