బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ రిలీజ్ కి రంగం సిద్దమవుతుంది. మరో 15 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అఖండ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అఖండ తదుపరి మూవీ NBK107 ని కూడా బాలయ్య అఫీషియల్ గా మొదలు పెట్టేసారు. ఇక NBK107 ఓపెనింగ్ కి కొరటాల శివ రావడంతో.. కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ మూవీ ఉండబోతుంది.. అందుకే ఆయన ఓపెనింగ్ వచ్చారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ ప్రచారానికి మరింత మసాలా అద్దుతున్నారు. అంటే కొరటాల శివ బాలయ్య తో అదిరిపోయే మల్టీస్టారర్ చేయబోతున్నారని, అది కూడా మహేష్ బాబు తో అంటూ ప్రచారం షురూ అయ్యింది.
బాలకృష్ణ - మహేష్ బాబు కాంబోలో కొరటాల ఓ మల్టీస్టారర్ కథ రెడీ చేసారని, త్వరలోనే ఈ కాంబో లో సినిమా రాబోతుంది అంటున్నారు. నిజంగా ఈ ప్రచారమే నిజమై మహేష్ - బాలయ్య కాంబో సెట్ అయితే ఫాన్స్ కి పూనకాలే. మరి కొరటాల ప్రస్తుతము ఆచార్య మూవీలో చిరు - రామ్ చరణ్ ని పెట్టి మల్టీస్టారర్ చేసాడు. ఆ సినిమాలో మహేష్ బాబే చరణ్ పాత్ర చెయ్యాల్సింది.. కొన్ని కారణాల వలన మహేష్ చెయ్యలేదు. కానీ ఇప్పుడు బాలయ్య - మహేష్ కాంబో ఖచ్చితంగా ఉంది అంటున్నారు. మరి ఇది ఎప్పటికి సాధ్యం కావాలి. అంటే బాలయ్య గోపీచంద్ మలినేని తర్వాత అనిల్ రావిపూడి తో ఆ తర్వాత ఆదిత్య 369 సీక్వెల్ అంటున్నారు. మరోపక్క మహేష్ సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్, అలాగే రాజమౌళి కి కమిట్ అయ్యాడు.