కోలీవుడ్ సూపర్ స్టార్ నయనతార బర్త్ డే సెలెబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.. బాయ్ ఫ్రెండ్, కాబోయే భర్త విగ్నేష్ శివన్ ఆధ్వర్యంలో నయనతార తన బర్త్ డే కేక్ కట్ చేసింది. ఎప్పటినుండో కలిసి సహజీవనం చేస్తున్న నయనతార - విగ్నేష్ శివన్ లు ఈ డిసెంబర్ లో పెళ్లి పీటలెక్కబోతున్నారనే న్యూస్ ఉంది. అయితే నయనతార బర్త్ డే వేడుకల్లో టాలీవుడ్ బ్యూటీ సమంత కూడా పాల్గొనడం హాట్ టాపిక్ అయ్యింది. అంటే నయనతార - సమంత కలిసి విగ్నేష్ శివన్ దర్శకత్వంలో కాతు వాక్కుల రెండు కాదల్ మూవీ లో నటిస్తున్నారు. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సమంత లుక్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
చెన్నై లోని షూటింగ్ జరుపుకుంటున్న కాతు వాక్కుల రెండు కాదల్ సెట్స్ లో జరిగిన నయనతార పుట్టిన రోజు వేడెక్కల్లో సమంత పాల్గొనడమే కాదు.. నయన్ కి కేక్ తినిపించి ప్రేమతో హాగ్ చేసుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నయనతార - సమంత కలిసి నయన్ బర్త్ డే ని ఎంతగా ఎంజాయ్ చేసారో అనే విషయాన్ని మీరు ఈ పిక్ చూసి తెలుసుకోండి.