బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రీతి జింటా తల్లయ్యింది. నటిగాను, పంజాబ్ ఐపీఎల్ జట్టుకి ఓనర్ గాను ప్రీతి జింటా సత్తా చాటుతున్నారు. 2016లో అమెరికాకు చెందిన జీన్ గూడెనఫ్ తో జీవితాన్ని పంచుకున్న ప్రీతిజింటా తాను తల్లయినట్టుగా సోషల్ మీడియా ద్వారా ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. సరోగసి విధానంలో కవల పిల్లలకు తల్లయినట్టుగా ప్రీతి జింటా చెప్పడం గమనార్హం. మీ అందరితో ఓ హ్యాపీ న్యూస్ పంచుకోవాలని అనుకుంటున్నాను. సరోగసి విధానంలో కవల పిల్లల్ని పొందినందుకు నేను, నా భర్త జీన్ గూడెనఫ్ ఎంతో సంతోషిస్తున్నాం. జై, జియాలను మా జీవితాల్లోకి ఆహ్వానించడం మాకెంతో సంతోషముగా ఉంది.
పేరెంట్స్ గా మా లైఫ్ లో కొత్త ప్రయాణం మొదలైంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో ఎల్లప్పుడూ మాకు తోడుగా నిలిచిన వైద్యబృందానికి కృతజ్ఞతలు అంటూ ప్రీతి జింటా ట్వీట్ చేసారు. ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్న ప్రీతి జింటా.. తెలుగులో వెంకటేష్ ప్రేమంటే ఇదేరా, మహేష్ బాబు రాజకుమారుడు సినిమాల్లో నటించింది. బాలీవుడ్ లోనూ ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా సత్తా చాటింది.