Advertisementt

బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ కి అప్పుడే లైఫ్ ఇచ్చేసారు

Thu 18th Nov 2021 12:05 PM
bigg boss,bigg boss telugu 5,eliminated contestants,star maa music  బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ కి అప్పుడే లైఫ్ ఇచ్చేసారు
Bigg Boss Telugu 5 Eliminated contestants in Star Maa programme బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ కి అప్పుడే లైఫ్ ఇచ్చేసారు
Advertisement
Ads by CJ

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 పదకొండు వారాలు పూర్తి చేసుకుని పన్నెండో వారంలోకి అడుగుపెట్టబోతుంది. ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 5 నుండి పదిమంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడారు. ఇంకా బిగ్ బాస్ లో కేవలం తొమ్మిదిమంది మాత్రమే ఉన్నారు. అందులో ఈ వారం ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. కెప్టెన్ రవి మాత్రమే నామినేట్ అవ్వలేదు. అయితే ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వారు మరే ఇతర ఛానల్ లోనూ.. ఓ ఏడాది పాటు కనిపించకూడదు అని అగ్రిమెంట్ మీదే వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. వస్తే సినిమా అవకాశాలు లేదంటే ఖాళీ అన్నట్టుగా ఓ ఏడాది పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉండిపోవాల్సిందే.

అయితే బిగ్ బాస్ హౌస్ నుండి అలా బయటికి వెళ్లారో.. లేదో.. అప్పుడే స్టార్ మా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కి లైఫ్ ఇచ్చేస్తుంది. అంటే కామెడీ స్టార్స్, స్టార్ట్ మ్యూజిక్ అంటూ స్టార్ మా లో తెగ హడావిడి చేస్తున్నారు. ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన సరయు దగ్గర నుండి.. ఉమాదేవి, నటరాజ్, లోబో, శ్వేతా, విశ్వ అందరూ స్టార్ మా లో తెగ హడావిడి చేస్తున్నారు. ఇక గత వారం ఎలిమినేట్ కాకుండా.. అనారోగ్యంతో హౌస్ ని వీడిన జెస్సి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ.. తాను బాగానే ఉన్నాను అంటూ ట్వీట్ చేసాడు. హౌస్ నుండి బయటికి వచ్చాక జెస్సి కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పార్టీలు అవి బాగానే ఎంజాయ్ చేసాడు. ఇక బిగ్ బాస్ లో ఉండి.. క్రేజ్ వచ్చినా రాకపోయినా.. స్టార్ మా మాత్రం వాళ్ళని ఆదుకోవడం పక్కా.. 

Bigg Boss Telugu 5 Eliminated contestants in Star Maa programme:

Bigg Boss Telugu 5 Eliminated contestants in Star Maa music

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ