Advertisementt

బేబమ్మ కృతి శెట్టి నాగలక్ష్మిగా అదరగొట్టేసింది

Thu 18th Nov 2021 11:32 AM
krithi shetty,akkineni nagarjuna,naga chaitanya,kalyan krishna,zee studios,annapurna studios pvt ltd,bangarraju movie,krithi shetty as naga lakshmi  బేబమ్మ కృతి శెట్టి నాగలక్ష్మిగా అదరగొట్టేసింది
Krithi Shetty First Look From Bangarraju Revealed బేబమ్మ కృతి శెట్టి నాగలక్ష్మిగా అదరగొట్టేసింది
Advertisement
Ads by CJ

అక్కినేని నాగార్జున - కళ్యాణ్ కృష్ణ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ సోగ్గాడే చిన్ని నాయనా కి సీక్వెల్ బంగార్రాజు మూవీ ని రీసెంట్ గానే మొదలు పెట్టారు. నాగార్జున బంగార్రాజుగా, రమ్య కృష్ణ మరోసారి నాగార్జున తో జోడి కట్టింది. సినిమా మొదలు పెట్టినప్పటినుండి.. జెట్ స్పీడు తో బంగార్రాజు షూటింగ్ ని కళ్యాణ్ కృష్ణ పరుగులు పెట్టిస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య - కృతి శెట్టి లు కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. ఉప్పెనలో బేబమ్మ గా ట్రెడిషనల్ గా ఆకట్టుకున్న కృతి శెట్టి.. బంగార్రాజు లో నాగ లక్ష్మీగా నటిస్తుంది. తాగాజా నాగ చైతన్య చేతుల మీదుగా కృతి శెట్టి నాగ లక్ష్మి లుక్ రివీల్ చేసారు.

#బంగర్రాజు త్వరలో రాబోతున్నారు …లేడీస్ ఫస్ట్ :-) @IamKrithiShettyని మా నాగలక్ష్మిగా పరిచయం చేస్తున్నాము.. ఇదిగోండి ఫస్ట్ లుక్ @iamnagarjuna @IamKrithiShetty @kalyankrishna_k @AnnapurnaStdios @ZeeStudios_ అని నాగ చైతన్య ట్వీట్ చేశారు.

కృతి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్‌లో పల్లెటూరి అమ్మాయిగా చాలా కూల్‌గా, చాలా అందంగా కనిపించింది.. ఆకుపచ్చ వోణి లో.. అందంగా నవ్వుతున్న కృతి శెట్టి మొహం కూడా అదే అందంతో మెరిసిపోయింది. ఇంకా కృతి శెట్టి మేడలో పూల దండ.. అన్ని చూస్తుంటే.. బేబమ్మ నాగలక్ష్మి గా ఇరగదీసేలా కనిపిస్తుంది. నాగ లక్ష్మి గా ఫస్ట్ లుక్ తోనే కృతి శెట్టి ఫాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక రొమాన్స్, ఎమోషన్స్, కమర్షియల్ అంశాలతో కూడిన కథగా బంగార్రాజు తెరకెక్కుతుంది. ప్రస్తుతం బంగార్రాజు కొత్త షెడ్యూల్ మైసూర్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలక పాత్రధారులు అంతా పాల్గొంటున్నారు. 

Krithi Shetty First Look From Bangarraju Revealed:

Krithi Shetty First Look From Akkineni Nagarjuna, Naga Chaitanya, Kalyan Krishna, Zee Studios, Annapurna Studios Pvt Ltd Bangarraju Revealed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ