Advertisementt

కాజల్-పూజ-తమన్నా హిట్టు.. మరి సమంత

Thu 18th Nov 2021 07:13 AM
kajal,pooja hegde,tamanna,samantha,special songs,samantha in pushpa special song  కాజల్-పూజ-తమన్నా హిట్టు.. మరి సమంత
Star Heroines Show Special Interest on Item Songs కాజల్-పూజ-తమన్నా హిట్టు.. మరి సమంత
Advertisement
Ads by CJ

టాప్ హీరోయిన్స్ గా ఉన్నప్పుడు.. చాలామంది హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ లో నటించడానికి అస్సలు ఒప్పుకోరు. అందుకే ఐటెం సాంగ్స్ కోసం కొంతమంది స్పెషల్ హీరోయిన్స్ ఉంటారు.. వారే దిక్కు అన్నట్టుగా ఉండేది ఒకప్పటి పరిస్థితి. కానీ సుకుమార్, కొరటాల లాంటి వాళ్ళు స్పెషల్ సాంగ్స్ మీనింగ్ మార్చేసి.. టాప్ హీరోయిన్స్ ని ఈ ఐటెం బరిలోకి దింపి సక్సెస్ అయ్యారు. టాప్ రేంజ్ లో ఉన్నప్పుడే కాజల్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కోసం ఎన్టీఆర్ తో మాస్ స్టెప్స్ తో కాలు కదపగా.. తమన్నా కూడా ఎన్టీఆర్ జై లవ కుశ లో మాస్ స్టెప్స్ తో గ్లామర్ గా రెచ్చిపోయింది.
ఇక పూజ హెగ్డే రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ మూవీ లో రామ్ చరణ్ సరసన ఐటెం సాంగ్ లో అదరగొట్టిసింది. ఈ ముగ్గురు హీరోయిన్స్ మాస్ స్టెప్స్ తో అదరగొట్టడమే కాదు.. ఆ సాంగ్స్ సూపర్ హిట్స్ అవ్వడమే కాదు.. ఆ సినిమాలు కూడా మాంచి హిట్స్ అయ్యాయి.
మరి ఇప్పుడు మరో టాప్ హీరోయిన్ సమంత కూడా స్పెషల్ సాంగ్ కి రెడీ అయ్యింది. అల్లు అర్జున్ హీరోయిన్ గా నటించడమే కాదు.. ఇప్పుడు ఆ అల్లు అర్జున్స్ సరసన పుష్ప లో పాన్ ఇండియా లెవల్లో కాలు కదపబోతుంది. మరి కాజల్, పూజ, తమన్నా లు హిట్ కొట్టినట్లుగా సమంత కూడా పుష్ప తో హిట్ కొడుతుందా? అల్లు అర్జున్ మాస్ స్టెప్స్ కి సమంత స్టెప్స్ మ్యాచ్ అవుతాయా?అనేది చూద్దాం.

Star Heroines Show Special Interest on Item Songs:

Kajal, Pooja Hegde, Tamanna, Samantha Show Special Interest on Item Songs

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ