గత రెండు నెలలుగా సోషల్ మీడియాలోనూ, వెబ్ మీడియాలోనూ, ఛానల్స్ లోనూ సమంత పేరు మార్మోగిపోతుంది. చైతూ నుండి విడిపోవాలనుకుంటున్న సమంత అన్న దగ్గర నుండి ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకుంటుంది సమంత అన్నవారు.. విడిపోయాక అసలెందుకు విడిపోయింది అన్నారు. ఇక అదంతా సద్దుమణిగింది కదా అనుకున్నాక సమంత తాజాగా అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప పాన్ ఇండియా ఫిలిం లో స్పెషల్ సాంగ్ చెయ్యడానికి ఒప్పుకుని షాకిచ్చింది. ఫస్ట్ స్పెషల్ సాంగ్ తో రచ్చ లేపబోతుంది.
అయితే పుష్ప లో ఐటెం సాంగ్ చేసేందుకు సమంత సుకుమార్ కి బోలెడన్ని కండిషన్స్ పెట్టింది అంటున్నారు. అంటే హైదరాబాద్ నడిబొడ్డున ఓ స్టూడియో లో పుష్ప స్పెషల్ సాంగ్ షూట్ చేద్దామనుకున్న సుకుమార్ కి.. అలా వద్దు.. నగర శివార్లలో ఈ సాంగ్ షూట్ చెయ్యండి అనడంతో సుక్కు ఇమ్మిడియట్ గా పుష్ప ఐటెం సాంగ్ సెటప్ ని రామోజీ ఫిలిం సిటీకి షిఫ్ట్ చేసారని.. హైదరాబాద్ మధ్యలో అయితే మీడియా ని ఫేస్ చెయ్యాల్సి వస్తుంది అని, అలాగే కాస్త రిలాక్డ్స్ గా ఉంటుంది అందుకే.. రామోజీ ఫిలిం సిటీలోనే ఈ సాంగ్ షూట్ చెయ్యమని అడిగింది అని, అంతేకాకుండా ఓ 5 డేస్ కి 1.5 కోట్లు మేకర్స్ సమంతకి పారితోషకంగా ఇస్తున్నారని, అలాగే హడావిడిలేకుండా తన సాంగ్ కంప్లీట్ చెయ్యాలనే కండిషన్స్ మీదే సమంత ఈ సాంగ్ చెయ్యడనికి ఒప్పుకుందట.
అంటే ధైర్యవంతురాలు సమంత మీడియా ని ఫేస్ చెయ్యడానికి జంకుతుందా? చైతు పై ప్రశ్నలు వేస్తె ఎలా అవాయిడ్ చెయ్యాలో తెలియకే సామ్ ఇలాంటి కండిషన్స్ పెట్టిందా అంటున్నారు నెటిజెన్స్.