బిగ్ బాస్ లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ నిన్నటివరకు కూల్ గానే జరిగింది. మధ్యలో షణ్ముఖ్ గర్ల్స్ ఫ్రెండ్ గుర్తుకు రావడంతో.. పక్కనే ఉన్న సిరిని ఇన్సల్ట్ చేసి ఏడిపించడం తప్ప. ఇక గోల్డ్ బాల్స్ ఎక్కువగా తీసి సన్నీహైయెస్ట్ లో ఉన్నాడు. ఈ రోజు ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ ఫ్రెండ్స్ మధ్యన మంట పెట్టేసింది. అంటే మానస్ - ప్రియాంక మధ్యలో బెలూన్స్ కి గాలి ఊదాలి, సన్నీ - మానస్ ల మధ్యన లేబుల్ లేని టి షర్ట్స్ వేసుకుని పూల్ లో దూకి బయటికి రావాలి.. దీనికి రవి సంచాలక్.. సన్నీ వేసుకున్న టి షర్ట్ కి లేబుల్ ఉంది అని రవి అనగానే.. దీన్ని లేబుల్ అంటారా మాస్టర్ అని సన్నీ అనగానే, చెప్పు అంటావ్.. మాట్లాడితే మాటలాడనియ్యవు అని రవి అనగానే.. లేబుల్ చూపియ్ నేను యాక్సప్ట్ చేస్తాను.. నువ్వేదంటే అదే.. ఆడాలన్న మూడే పోయింది అంటూ సన్నీ రవిపై ఫైర్ అయ్యాడు.
అదే వాష్ ఏరియా లోను మానస్ తో సన్నీ లేబుల్ డిస్కర్షన్ పెట్టడమే కాదు.. నేను వేసుకున్న టి షర్ట్ కి లేబుల్ ఉందా.. అంటూ మానస్ షర్ట్ పై ఉన్న లేబుల్ చూపిస్తాడు సన్నీ.. ఫ్రెండ్ గా మాట్లాడకు.. నా షర్ట్ మీద అసలు లేబుల్ ఉందా.. అంటాడు. దానికి మానస్ అది కాదురా.. ఒక్కసారి ఆలోచించు అన్నా సన్నీ వినడు. కాజల్ వచ్చి నువ్వు తీసి ఆ హడావిడిలో కూడా సరిగ్గా వెయ్యాలి అదే గేము.. ముందు చెప్పాలి.. అర్ధం కావడం లేదు ఆ టి షర్ట్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి. ప్రతిసారి మీరే.. ఆడండి మీరు మీరే గేమ్ లో అంటూ కాజల్, మానస్ లపై సన్నీ ఫైర్ అయ్యాడు.