కరోనా పాండమిక్ సిట్యువేషన్ అంతా సద్దుమణగడంతో.. థియేటర్స్ అన్ని ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. వారం వారం థియేటర్స్ దగ్గర కొత్త సినిమాల సందడి.. బాక్సాఫీసు గలగలలు, ప్రేక్షకుల కిలకిలలుతో సందడి వాతావరణం కనిపిస్తుంది. జులై నుండి థియేటర్స్ ఓపెన్ అయినా.. మిడియం, లో బడ్జెట్ మూవీస్ మాత్రమే ప్రేక్షకుల ముందుకు రాగా.. డిసెంబర్ నుండి భారీ బడ్జెట్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అఖండ మూవీ తో డిసెంబర్ 3న బాలయ్య బాక్సాఫీసు దగ్గర గర్జించడానికి వచ్చేస్తున్నాడు.. ఆ తర్వాత పుష్ప పాన్ ఇండియా ఫిలిం, ఆ తర్వాత క్రిష్ట్మస్ స్పెషల్ గా వరుణ్ తేజ్ గని, నాని శ్యామ్ సింగరాయ్ మూవీస్ పోటీకి దిగుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. జనవరి ఫస్ట్ వీకెండ్ కి క్రేజీ పాన్ ఇండియా ఫిలిం ఆర్.ఆర్.ఆర్ వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మార్కెట్ లోనూ, ప్రేక్షకుల్లోనూ భీభత్సమైన క్రేజ్ ఉన్న ఆర్.ఆర్.ఆర్ మూవీ బాక్సాఫీసుని చీల్చి చెండాడడం ఖాయంగా కనిపిస్తుంది.
ఆ తర్వాత సంక్రాతి కి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ రాబోతుంది. జనవరి 12 న భీమ్లా నాయక్ రిలీజ్ ని మరోసారి కన్ ఫర్మ్ చేసింది టీం. మరి పవర్ స్టార్ భీమ్లా నాయక్ అప్ డేట్ ఏదైనా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. మరోపక్క పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ కూడా సంక్రాంతికే రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ అంటే పాన్ ఇండియా లో ఎంత క్రేజ్ ఉందో, బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద ఏ రేంజ్ అంచనాలుంటాయో సాహో తోనే చూసాం. మరి జనవరిలో ఆర్.ఆర్.ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ సినిమాల దాడితో బాక్సాఫీస్ భయపడేలా కనబడుతుంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్, పవన్ - రానా భీమ్లా నాయక్ లు మల్టీస్టారర్లు గాను, ప్రభాస్ రాధేశ్యామ్ పై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలున్నాయి. సో.. ఈ వార్ లో విన్ అయ్యేది ఎవరు అనే కన్నా.. ఈ వార్ మాత్రం మాంచి ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది.