ప్రస్తుతం రాజమౌళి గారు.. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ హడావిడిలో ఉన్నారు.. జనవరి 7న విడుదల కాబోయే ఆర్.ఆర్. ఆర్ పైన రాజమౌళి ఫోకస్ పెట్టారు.. పాన్ ఇండియా లెవల్లో మార్మోగిపోయేలా ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ప్లాన్ లో ఉన్నారు అనుకుంటున్నారు. నిజమే.. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ పనుల్లో బిజీ. ఆ సినిమా రిలీజ్ అయ్యేవరకు రాజమౌళికి నిద్రే పట్టదు. అయితే మొన్నామధ్యన ఓ కాలేజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన రాజమౌళి రీసెంట్ గా చిరు నటించిన కొదమ సింహం మూవీ గురించి మట్లాడారు.. అందులో ఓ సీన్ తనకి నచ్ఛలేదంటూ మొహమాటంలేకుండా చెప్పారు రాజమౌళి.
చిరంజీవి గారికి అభిమాని అయిన నేను చిరు కొదమ సింహం సినిమా చూస్తున్నా.. ఆ సినిమాలో ఓ సీన్ లో రౌడీ లు చిరంజీవి గారిని ఇసుకలో కప్పెట్టేసి తల మాత్రమే బయట ఉంచుతారు. ఆ తర్వాత ఆయన్ని ఇసుకలో వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతే.. చిరంజీవి గారి గుర్రం వచ్చి ఆయన్ని ఆ ఇసుక నుండి బయటికి తీస్తుంది.. ఆ సీన్ చూస్తున్నంత సేపు చాలా ఎమోషనల్ అయ్యాను. కానీ చిరు గారిని బయటికి లాగాక ఆయన గుర్రాన్ని పట్టించుకోలేదు.. అంటే ఆయనకి గుఱ్ఱానికి అనుబంధం లేదా.. ఆ కష్టం నుండి బయటపడేసిన గుర్రం సాయం చేసే మనిషి కన్నా ఎక్కువ. అసలు ప్రాణాలు కాపాడిన ఆ గుర్రానికి థాంక్స్ కూడా చెప్పకపోవడం అనే సన్నివేశం నాకు నచ్చలేదు. ఆ ఎమోషన్ అక్కడ పండలేదు. అప్పటినుండి ఆ సీన్ నా మైండ్ లో రిజిస్టర్ అయ్యింది.
మగధీర లో రామ్ చరణ్ ని ఇసుక నుండి బయటికి లాగిన గుర్రాన్ని చరణ్ కౌగిలించుకోవడంతో ఆ సీన్ లోని ఎమోషన్ పండింది దానిని ఫ్రెండ్ లా భవిస్తూ దానితో మాట్లాడేలా డైలాగ్స్, సన్నివేశాలు రాసుకున్నాని చెప్పారు.
అయితే అక్కడ చిరు - గుర్రం మధ్యన ఎమోషనల్ బాండ్ లేదని రాజమౌళి ఫీలయ్యారు. కానీ అది చిరు తప్పుకాదేమో.. దర్శకుడు ఏది చెబితే అది చేసే.. చిరు తన పని తాను చేసుకుపోయారు.. అంటే అక్కడ దర్శకుడి తప్పే ఉంది. అది అలోచించి సారూ అంటున్నారు మెగా ఫాన్స్..