Advertisementt

బిగ్ బాస్ 5: అరరే.. సిరి కి ఏమైంది

Tue 16th Nov 2021 06:50 PM
siri,bigg boss,bigg boss telugu,bigg boss telugu 5,shanmukh angry with siri  బిగ్ బాస్ 5: అరరే.. సిరి కి ఏమైంది
Bigg Boss 5: Siri ran into the bathroom and locked the door బిగ్ బాస్ 5: అరరే.. సిరి కి ఏమైంది
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 లో 11 వ వారం నామినేషన్స్ వేడి మాములుగా లేదు.. కేవలం కెప్టెన్ రవి తప్ప.. ఈ వారం మిగతా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వెళ్లారు.. కాజల్ - సిరి, కాజల్ - ఆని మాస్టర్, రవి సన్నీ, సన్నీ - శ్రీరామ చంద్ర, మానస్, షణ్ముఖ్ ల మధ్యన యుద్ధమే జరిగింది. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ఇంట్రెస్టింగ్ గా కనిపించింది.. తమకి దొరికిన ఎల్లో టోపీతో సన్నీ, రవి, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్ లు గోల్డ్ బాల్స్ సాధించి వాటిని కాపాడుకోవాలి.. అందులో ఆని మాస్టర్ సన్నీ బాల్స్ దొబ్బేస్తానంటూ కామెడీ చేసింది. ఇక షణ్ముఖ్ గోల్డ్ బాల్స్ దొబ్బేయ్యడానికి రవి కాచుకుని కూర్చున్నాడు.

అయితే టాస్క్ లో ఏం గొడవలు జరిగిందో తెలియదు కానీ.. షణ్ముఖ్ ఇంకా సిరి వాష్ ఏరియాలో కూర్చున్నారు. షణ్ముఖ్ చాలా కోపం గా సిరిని పదే పదే హార్ట్ చేసాడు. సిరి ఏడ్చినా తాను కరగలేదు.. ఇక హౌస్ లో ఉన్నవాళ్లు సిరి - షణ్ముఖ్ లు ఏడుస్తున్నారనగానే. వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వండి.. ఇద్దరూ మాట్లాడుకోనివ్వండి చూద్దాం అనుకుంటున్నారు.. ఇంతలోపులో షణ్ముఖ్ మరోసారి సిరి ని నువ్వెళ్లు అనగానే సిరి ఏడుస్తూ మైక్ తీసి వాష్ రూమ్ డోర్ కి తగిలించి లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకుంది.. షణ్ముఖ్ వెంటనే లేచి డోర్ తియ్యమన్నా తియ్యలేదు.. ఇది విన్న హౌస్ మేట్స్ అందరూ పరిగెత్తుకుంటూ వాష్ ఏరియా కి వచ్చేసారు. రవి, షణ్ముఖ్ ఎంతగా డోర్ కొట్టినా సిరి తియ్యలేదు.. మరి సిరి ఏం చేసిందో తెలియాలంటే.. ఈ రోజు ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 

Bigg Boss 5: Siri ran into the bathroom and locked the door :

 Bigg Boss Telugu: Shanmukh angry with Siri 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ