Advertisementt

ప్లేస్ లు మార్చుకున్న కాజల్ అండ్ త్రిష

Mon 15th Nov 2021 10:19 PM
trisha,kajal,kamal haasan,indian 2 movie,kajal acharya movie,trisha indian 2 movie  ప్లేస్ లు మార్చుకున్న కాజల్ అండ్ త్రిష
Trisha replaced Kajal in Indian 2 ప్లేస్ లు మార్చుకున్న కాజల్ అండ్ త్రిష
Advertisement
Ads by CJ

తెలుగులో మెగాస్టార్ చిరు తో చెయ్యాల్సిన ఆచార్య మూవీ నుండి అప్పట్లో హీరోయిన్ త్రిష కొన్ని కారణాల వలన తప్పుకోగా.. త్రిష ప్లేస్ లోకి కాజల్ అగర్వాల్ వచ్చింది చేరింది. చిరు సరసన ఆచార్య మూవీలో కాజల్ అగర్వాల్ నటించింది. ఆ సినిమా కంప్లీట్ కూడా అయ్యింది. ఇప్పుడు కాజల్ ప్లేస్ లోకి త్రిష వెళ్లినట్లుగా తెలుస్తుంది. అంటే కాజల్ అగర్వాల్ ఈ మధ్యన నాగార్జున - ప్రవీణ్ సత్తారు మూవీ నుండి తప్పుకోవడమే కాకుండా.. తమిళనాట మళ్ళీ మొదలు కాబోతున్న ఇండియన్ 2 మూవీ నుండి తప్పుకుంది అని, ఆమె తల్లికావడం చేతనే కాజల్ అగర్వాల్ సినిమాల నుండి తప్పుకుంటుంది అనే ప్రచారం ఉంది. ఇండియన్ 2 కి కాజల్ అగర్వాల్ హ్యాండ్ ఇచ్చింది అంటున్నారు. 

అయితే ఇప్పుడు కాజల్ ఇండియన్ 2 స్థానాన్ని త్రిష భర్తీ చేసింది అంటున్నారు. అంటే కమల్ సరసన త్రిష నటించబోతుంది అని తెలుస్తుంది.

కమల్ హాసన్ సరసన నటించాల్సిన కాజల్ ఈ మూవీ నుండి తప్పుకోగా.. ఆ ప్లేస్ లోకి త్రిష చేరింది అంటున్నారు. సో టాలీవుడ్ లో త్రిష చెయ్యాల్సిన మూవీ కాజల్ చేసింది.. అక్కడ తమిళనాట కాజల్ చెయ్యాల్సిన మూవీ త్రిష చేస్తుంది.. సో ఈ హీరోయిన్స్ ఇద్దరూ అలా ప్లేస్ లు మార్చుకున్నారు. మరి మెగాస్టార్ - కాజల్ కాంబో ఆచార్య ఫిబ్రవరి 4 న రిలీజ్ కాబోతుంది. ఇక ఇండియన్ 2 రెస్యూమ్ షూట్ త్వరలోనే అంటున్నారు.

Trisha replaced Kajal in Indian 2:

Trisha replaced Kajal in Kamal Indian 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ