Advertisementt

బిగ్ బాస్ 5: ఇంట్రెస్టింగ్ నామినేషన్స్

Mon 15th Nov 2021 05:12 PM
bigg boss 5,bigg telugu,bigg boss,11th week nominations heat  బిగ్ బాస్ 5: ఇంట్రెస్టింగ్ నామినేషన్స్
Bigg Boss 5: Interesting Nominations బిగ్ బాస్ 5: ఇంట్రెస్టింగ్ నామినేషన్స్
Advertisement
Ads by CJ

గత రెండు వారాలుగా బిగ్ బాస్ సీజన్ 5 లో కాస్త ఇంట్రెస్టింగ్ టాస్క్ లు, ఇంట్రస్టింగ్ గొడవలు, ఇంట్రెస్టింగ్ నామినేషన్స్ అంటూ జరుగుతున్నాయి. బిగ్ బాస్ 5 మొదటి నుండి బోర్ కొట్టించినా.. ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకుల్లో బిగ్ బాస్ 5 పై ఆసక్తి పెరుగుతుంది. ఇక పది వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 5 11వవారంలోకి అడుగు పెట్టింది.. అది కూడా ఇంట్రెస్టింగ్ నామినేషన్స్ తో. గత వారం జరిగిన గొడవలతో.. ఈ వారం నామినేషన్స్ సెగ హౌస్ లో హీట్ పుట్టించింది. నామినేట్ చేసిన కంటెస్టెంట్ పై స్లైమ్ పోసి నామినేట్ చెయ్యాలి. అందులో హౌస్ మేట్స్ కాజల్, సన్నీ లను ఎక్కువగా టార్గెట్ చేసారు. షణ్ముఖ్ - సన్నీ ల మధ్యన వార్.. అలాగే కాజల్ - రవి ల మధ్యన నామినేషన్స్ ప్రక్రియ గొడవలు పెట్టింది.

అయితే ఈ వారం కెప్టెన్ తప్ప మిగతా హౌస్ మేట్స్ అంతా నామినేట్ అవడం హాట్ టాపిక్ అయ్యింది. లీకైన సమాచారం మేరకు కెప్టెన్ రవి తప్ప ఆని మాస్టర్, సన్నీ, ప్రియాంక, మానస్, కాజల్, సిరి, షణ్ముఖ్, శ్రీరామ్ చంద్ర ఇలా హౌస్ లో ఉన్నవారంతా నామినేషన్స్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇక తాజా ప్రోమోలో సిరి అండ్ ఆని మాస్టర్ లు కాజల్ ని ఎక్కువగా టార్గెట్ చేసారు. షణ్ముఖ్ కూడా కాజల్ ని నామినేట్ చేస్తూ కాజల్ నువ్వు వెళ్ళిపోతే హౌస్ లో గొడవలు తగ్గుతాయనడం నేను తీసుకోలేకపోతున్నా అంది కాజల్. మరి ఈ వారం ఎనిమిదిమందిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.

Bigg Boss 5: Interesting Nominations :

Bigg Boss 5: 11th Week Nominations Heat

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ