నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంత రేంజ్, క్రేజ్ మరింతగా పెరిగాయా అనిపించేలా ఉంది.. సమంత వాలకం. ఇప్పటికే తెలుగు, తమిళ్ లో రెండు బై లింగువల్ ప్రాజెక్ట్స్ కి కమిట్ అయిన సమంత.. తాజాగా ఐటెం సాంగ్ కూడా చేయబోతుంది అని.. అది కూడా తనకి రంగస్థలంలో రామలక్ష్మి లాంటి అద్భుతమైన కేరెక్టర్ ఇచ్చిన సుకుమార్ కోసం అంటున్నారు. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో.. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న పుష్ప మూవీ ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం తమన్నా, పూజ హేగ్డ్ ల పేర్లు పరిశీలించిన టీం కి సమంత అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 తో పాన్ ఇండియా లేవల్లో అదరగొట్టేసింది.. ఆమె అయితే బావుంటుంది అని ఆలోచిస్తున్నారట.
ఎక్కువ శాతం సమంత నే పుష్ప స్పెషల్ సాంగ్ లో అల్లు అర్జున్ తో కాలు కదిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక సమంత హాలీవుడ్ సినిమాలో సైతం నటించబోతోందన్న విషయం వినం హీరోయిన్స్ షాకవుతున్నారు. అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ అనే సినిమాలో సమంత కీ రోల్ పోషిస్తోందట. పెళ్లి తర్వాత అందులోనూ డివోర్స్ తర్వాత సమంత క్రేజ్ కి ఆమె స్పీడుకి మిగతా హీరోయిన్స్ బెంబేలెత్తుతున్నారట. మరి సమంత గనక పుష్ప ఐటమ్ సాంగ్ లో చేసింది అంటే.. ఆ సాంగ్ కి భీభత్సమైన క్రేజ్ ఉంటుంది.. ఎందుకంటే సమంత ఇంతవరకు ఒక్క ఐటెం లో కూడా కనిపించలేదు అందుకే..