Advertisementt

గని పంచ్ అదిరింది.. రిలీజ్ డేట్ మారింది

Mon 15th Nov 2021 11:57 AM
ghani,ghani teaser,varun tej,kiran korrapati,saiee manjrekar,jagapathi babu,suniel shetty,upendra,naveen chandra,nadiya,naresh  గని పంచ్ అదిరింది.. రిలీజ్ డేట్ మారింది
Ghani changes release date : teaser elevates Varun Tej as a boxer గని పంచ్ అదిరింది.. రిలీజ్ డేట్ మారింది
Advertisement
Ads by CJ

వరుణ్ తేజ్ - కిరణ్ కొర్రపాటి కాంబోలో తెరకెక్కిన గని మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది. దానితో ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో మొదలు పెట్టారు. గత నాలుగు రోజులుగా గని మూవీ కేరెక్టర్స్ ని రివీల్ చేస్తూ టీజర్ పై ఆసక్తిని క్రియేట్ చేసింది టీం. వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్న ఈ సినిమా కోసం వరుణ్ ఫిట్ నెస్ విషయంలో, సిక్స్ ప్యాక్ విషయంలో చాలానే కష్టపడ్డాడు. రామ్ చరణ్ చేతుల మీదుగా వరుణ్ తేజ్ గని టీజర్ రిలీజ్ అవడమే కాదు.. గని టీజర్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తోనే మొదలు కావడం.. మెగా ఫాన్స్ కి కిక్ ఇచ్చింది.

ప్రతి ఒక్కడి కథలో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి.. కోరికలుంటాయి, కోపాలుంటాయి, కలబడితే గొడవలుంటాయి.. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కడికి ఛాంపియన్ అయ్యిపోవాలన్న ఆశ ఉంటుంది. కానీ విజేతగా నిలిచేది ఒక్కడు.. ఆ ఒక్కడే నువ్వెందుకవ్వాలి.. వై.. యు, ఆట ఆడినా ఓడినా రికార్డ్స్‌లో ఉంటాం. కానీ గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటాం.. అంటూ చరణ్ వాయిస్ ఓవర్ లో చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది.. ఇక చరణ్ వాయిస్ ఓవర్ చెప్పినంతసేపు వరుణ్ తేజ్ గని గా బాక్సింగ్ కోసం ఎన్ని కష్టాలు, కన్నీళ్లు చవి చూసాడా విజువల్ గా చూపించారు. టీజర్ కి మెయిన్ హైలెట్స్, వరుణ్ తేజ్ పంచ్, సిక్స్ ప్యాక్ లుక్, డైరేక్షన్, తల్లి -కొడుకుల అనుబంధం, సాయి మంజ్రేకర్ తో రొమాంటిక్ యాంగిల్, విలన్స్ తో తలపడే వరుణ్ పవర్, బ్యాగ్ రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్ని టీజర్ కి హైలెట్ గా నిలిచాయి. 

అయితే ఇంతకుముందు డిసెంబర్ 3 న రిలీజ్ డేట్ ఇచ్చిన గని.. తాజాగా టీజర్ లో డిసెంబర్ 24 న రిలీజ్ అవుతున్నట్టుగా.. అంటే డిసెంబర్ 3 నుండి పోస్ట్ పోన్ అయ్యి డిసెంబర్ 24 క్కి గని రిలీజ్ డేట్ మారినట్లుగా మేకర్స్ ప్రకటించారు. 

Ghani changes release date : teaser elevates Varun Tej as a boxer:

Ghani teaser elevates Varun Tej as a boxer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ