నిన్న ఆదివారం బిగ్ బాస్ నుండి కాజల్ కానీ, మానస్ కానీ ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితిల్లో వాళ్లిద్దరూ జెస్సి వలన సేవ్ అయ్యి.. బ్రతికి పోయారు. లేదంటే కాజల్ కానీ, మానస్ కానీ ఎలిమియేట్ అయ్యి హౌస్ ని వీడేవారే.. జెస్సి అనారోగ్యం కారణంగా డాక్టర్స్ ట్రీట్మెంట్ అవసరం కాబట్టి.. జెస్సి ని హౌస్ నుండి పంపేశారు. వెళుతూ వెళుతూ జెస్సి చాలా బాగా మట్లాడడమే కాదు.. కంటెస్టెంట్స్ కి ఎలా కావాలి, ఏం కావాలి అనేది నీట్ గా చెప్పాడు. సన్నీ ని పిలిచి నీ గేమ్ సూపర్.. కానీ ఫ్రెండ్స్ గురించి అలోచించి గేమ్ స్పాయిల్ చేసుకోకు అని, కాజల్ ని పిలిచి.. నీ గేమ్ నువ్వు ఆడు అక్కా.. నీ గేమ్ ఇంకొకరు ఆడుతున్నారని, మానస్ కి కూడా అదే చెప్పిన జెస్సి.. శ్రీరామ్ చంద్రని పిలిచి.. నువ్వు సూపర్ గా గేమ్ ఆడుతున్నావ్.. అలానే ఆడు అంటూ ఎంకరేజ్ చేసాడు.
ఇక ప్రియాంక కి ప్రేక్షకులు ఏం చెప్పదలిచారో అదే చెప్పాడు.. నువ్వు గేమ్ ఆడు త్యాగాలు చెయ్యకు అని, ఇక ఆని మాస్టర్ ని పిలిచి మీ స్మైల్ చాలా బావుంది మేడం అన్నాడు. రవి ని పిలిచి నువ్వు గేమ్ బాగానే ఆడావు .. లాస్ట్ లో గివప్ ఇచ్చావ్ అది నచ్చలేదు అన్నాడు.. సిరిని ఫోన్ లో పిలవగా.. సిరి కన్నీళ్లు పెట్టుకుంది, కొన్ని మాటలు మట్లాడకు గేమ్ ఆడు.. ఒక్కరి కోసం డబ్బులు ఇవ్వడం కరెక్ట్ గా లేదు అంటూ ఐ లవ్ యు చెప్పాడు. సిరిని ముద్దడిగాడు. ఇక షన్ను ని పిలిచి నీతో లాస్ట్ 4 డేస్ ఉండలేకపోయాను.. నువ్వు మొన్న ఫైట్ చేస్తూ మాట్లాడుతుంటే.. నన్ను నేను నీలో చూసుకున్నానని, నాకు ఇంట్లోకి వచ్చెయ్యాలని అనిపించింది.. నా ఫ్రెండ్ కి నేను సపోర్ట్ గా లేను అని ఫీలయ్యాను అని అనగానే షణ్ముఖ్ కూడా నువ్వు సూపర్ రా వెళుతూ వెళుతూ హౌస్ లో ఉండేందుకు మరొకరికి లైఫ్ ఇచ్చావ్ అన్నాడు.. ఇక నాగ్ జెస్సిని సగౌరవంగా హౌస్ మేట్స్ కి బైబై చెప్పించి ఇంటికి పంపేశారు.