Advertisementt

అఖండగా అఘోర గర్జిస్తే.. శివ తాండవమే

Sun 14th Nov 2021 07:57 PM
nandamuri balakrishna,boyapati srinu,dwaraka creations,akhanda movie,akhanda trailer roar out  అఖండగా అఘోర గర్జిస్తే.. శివ తాండవమే
Balakrishna Akhanda Trailer Roar Out అఖండగా అఘోర గర్జిస్తే.. శివ తాండవమే
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల మోస్ట్ అవైటెడ్ చిత్రం అఖండ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రమోషన్స్ లోకి దిగిపోయింది. టీజర్స్, సాంగ్స్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన.. మేకర్స్ ఈరోజు ఆదివారం నవంబర్ 14 న అఖండ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. అఖండ ట్రైలర్ తో పాటుగా అఖండ మూవీ డిసెంబర్ 2 న థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్టుగా గ్రాండ్ గా ప్రకటించారు. 

అఖండ రెండు టీజర్లు బాలకృష్ణలోని రెండు విభిన్న షేడ్స్‌ని పరిచయం చేయగా, ట్రైలర్ లో బాలయ్య లోని రెండు కోణాలను చూపిస్తుంది. బాలకృష్ణ సింహంలా గర్జించడమే కాదు.. అఘోరాగా బాలయ్యని బోయపాటి ఇంతకు ముందెన్నడూ చూడని భీకరమైన రూపంలో చూపించాడు. విధికి విధాతకి విశ్వానికి సవాళ్లు విసరకూడదు అనే వాయిస్ ఓవర్ తో మొదలైన అఖండ ట్రైలర్.. బాలయ్య ని వైట్ అండ్ వైట్ లుంగీలో పవర్ ఫుల్ గా చూపించారు.. మేమేమిటో అంచనా లేకుండానే హామీలు ఇస్తున్నావ్ అని విలన్ అన్న మాటకి బాలయ్య గర్జిస్తూ ఏయ్ అంచనా వెయ్యడానికి నువ్వేమన్నా పోలవరం డామా .. పట్టి సీమ తూమా .. పిల్ల కాలువ అంటూ చేసే యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. మెయిన్ విలన్‌గా నటించిన శ్రీకాంత్ సూపర్ మేకోవర్ లో అదరగొట్టడమే కాదు.. డైలాగ్ డెలివరీలో ఇరగదీసాడు.. నాకు బురద అంటింది.. నాకు దురద వచ్చింది, నాకు బ్లడ్ వచ్చింది, నాకు గడ్డ వచ్చింది అని అడ్డమైన సాకులు చెప్తూ పనాపితే అంటూ పనివాళ్లని బెదిరించే డైలాగ్ అదిరింది. అఘోరాగా బాలయ్య ఎంట్రీ అద్భుతమే.. నిజమైన శివుడిని చూసిన ఫీలింగ్. 

బాలయ్య అఘోర గెటప్ లో.. ఒక మాట నువ్వంటే శబ్దం.. అదే నేను అంటే శాసనం.. దైవ శాసనం, అఖండ.. నేనే.., నేనే..నేనే  మీకు సమస్య వస్తే దణ్ణం పెడతారు.. మేము పిండం పెడతాం అంటూ ఇంగ్లీష్ లో చెప్పే డైలాగ్స్ అన్ని అదిరాయనే చెప్పాలి.

బాలకృష్ణ మరియు శ్రీకాంత్ మధ్య ఫేస్ టు ఫేస్ సీన్స్ అఖండ పైకి మెయిన్ హైలైట్స్ గా ఉండబోతున్నాయి. ఇక ప్రగ్య జైస్వాల్ - బాలయ్య మధ్యన రొమాంటిక్ సన్నివేశాలు, జగపతి బాబు స్వామిజిగా, థమన్ తన రోరింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో విజువల్స్‌ను ఎక్కడికో తీసుకెళ్లాడు.  డైలాగ్స్, బోయపాటి మేకింగ్, సినిమాటోగ్రఫీ..ద్వారకా క్రియేషన్స్‌ మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణ విలువలు అన్ని హై రేంజ్ లో కనిపిస్తున్నాయి.. మరి ట్రైలర్ తో ఇప్పటివరకు ఉన్న అంచనాలు ఆకాశాన్నితాకేలా చేసారు.

Balakrishna Akhanda Trailer Roar Out:

Nandamuri Balakrishna, Boyapati Srinu, Dwaraka Creations Akhanda Trailer Roar Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ