బాలయ్య కోసం చొక్కాలుచించుకునే ఫాన్స్ కోకొల్లలు. అందులో ప్రస్తుతం బాలయ్య తో NBK107 సినిమాని డైరెక్ట్ చేస్తున్న గోపీచంద్ మలినేని కూడా ఉన్నాడట. నిన్న శనివారం జరిగిన NBK107 ఓపెనింగ్ తర్వాత గోపీచంద్ మలినేని ఎంతో ఎగ్జైట్ అవుతూ చెప్పిన విషయం ఏమిటి అంటే.. చిన్నప్పుడు నేను చొక్కాలు చించుకుని ఒక్క సారైనా కలవాలని కలలు కన్న నా హీరో. ఇండస్ట్రీకి వచ్చాక ఎలాగైనా ఆయన్ని డైరెక్ట్ చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్న నా అభిమాన మాస్ హీరో.
నా బాలయ్యతో పని చేసే భాగ్యం కలగడం నా life time achievement కంటే lifetime responsibilityగా భావిస్తూ.జై బాలయ్య అంటూ ట్వీట్ చేసాడు గోపీచంద్ మలినేని. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో బాలకృష్ణ ని డ్యూయెల్ రోల్ లో ఈ సినిమాలో చూపించబోతున్నాడు గోపిచంద్ మలినేని.. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా ఎంపికవడమే కాదు.. NBK107 పూజా కార్యకమాలకు విచ్చేసింది. ఇక గోపీచంద్ మలినేని తో మూడోసారి వర్క్ చేస్తున్నందుకు శృతి హాసన్ ఆ డైరెక్టర్ కి థాంక్స్ కూడా చెప్పింది.