Advertisementt

ఈ వారం హౌస్ లో అనుకున్నదే అయ్యింది

Sat 13th Nov 2021 09:20 PM
jessie,bigg boss telugu,bigg boss,bigg bosss 5,jessie to be eliminated  ఈ వారం హౌస్ లో అనుకున్నదే అయ్యింది
Bigg Boss 5: Shocking Eviction In Bigg Boss Telugu 5 ఈ వారం హౌస్ లో అనుకున్నదే అయ్యింది
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 పదవ వారం పూర్తి చేసుకుని 11వ వారంలోకి అడుగుపెట్టబోతుంది. ఈ వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే విషయమై అందరిలో మాంచి ఇంట్రస్ట్ ఉంది. ఎందుకంటే ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది గట్టి కంటెస్టెంట్స్.. రవి, మానస్, సన్నీ, కాజల్, సిరి లు ఉన్నారు. వీళ్ళలో చాలామంది టాప్ 5లో ఉన్న జాబితాలో ఉన్నవాళ్లే. ఇక ఈ వారం రవి కెప్టెన్ గా ఇమ్యూనిటీ పొందాడు. ఫైనల్ గా మానస్, కాజల్ లు ఇద్దరూ డేంజర్ జోన్ లో ఉండడంతో వారిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటే. ఇక్కడ బిగ్ బాస్ లో ట్విస్ట్ ఇచ్చారు. అదేమిటంటే.. ఈ వారం నామినేషన్స్ లో లేని జెస్సి ఎలిమినేట్ అవ్వడం.

గత రెండు వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న జెస్సి ని డాక్టర్స్ చూసినా.. అతని ఆరోగ్యం మెరుగుపడకపోయేసరికి.. ఈ వారం జెస్సి ని డైరెక్ట్ గా సీక్రెట్ రూమ్ నుండే డైరెక్ట్ గా బిగ్ బాస్ స్టేజ్ పై నాగార్జున తో పాటుగా నించోబెట్టి.. అతన్ని ఎలిమినేట్ చేసారు. అంటే జెస్సి అనారోగ్యం వలన అతను ఈ వారం హౌస్ నుండి వెళ్లిపోగా.. మిగతా వాళ్ళు ఈ గండం నుండి గట్టెక్కారు. ఇక జెస్సి నాగార్జున తో రేపు ఆదివారం స్టేజ్ పై ఉంది.. హౌస్ మేట్స్ కి బై బై చెప్పేసి.. ఇంటికెళ్లిపోయాడు. మరి ఎప్పటిలాగే ఈ వారం ఎలిమినేషన్ కూడా ఒక రోజు ముందే లీకైపోయింది. 

Bigg Boss 5: Shocking Eviction In Bigg Boss Telugu 5:

Jessie to be eliminated 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ