బాలకృష్ణ ఫాన్స్ కి గుడ్ న్యూస్ లు మీద గుడ్ న్యూస్ లే వినిపిస్తున్నాయి. ఒకేసారి మూడు సర్ ప్రైజ్ లతో బాలయ్య ఫాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నారు. నిన్న అన్ స్టాపబుల్ సెకండ్ ఎపిసోడ్ నాని తో టాక్ షో చేసిన బాలయ్య గత రాత్రి నుండి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఇక ఈ రోజు శనివారం నవంబర్ 13 ఉదయం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య NBK107 పూజా కార్యక్రమాలతో మొదలైపోయింది. దానితో ఫాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక అఖండ ట్రైలర్ ట్రీట్ నవంబర్ 15 న అంటూ ప్రచారం జరుగుతుంది. ఇక ఆ అప్ డేట్ కోసం బాలయ్య ఫాన్స్ వెయిటింగ్. NBK107 ఓపెనింగ్ అయిన కాసేపటికే అఖండ అప్ డేట్ కూడా ఇచ్చేసారు మేకర్స్.
ఈ రోజు శనివారం సాయంత్రం 5.43 నిమిషాలు హై రేంజ్ అప్ డేట్, ఎక్స్ట్రా సర్ ప్రైజ్, ఎక్స్ట్రా ట్రీట్ రాబోతుంది అంటూ ఊరించినట్టుగానే.. అఖండ ట్రైలర్ ని నవంబర్ 14 రాత్రి 7.09 నిమిషాలకు రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా.. డేట్ అండ్ టైం ఫిక్స్ చేసిన మేకర్స్.. బాలయ్య అఘోర పోస్టర్ ని వదిలారు. ఒకేసారి మూడు సర్ ప్రైజ్ లతో నందమూరి ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి. రేపు అంటే ఆదివారం అఖండ ట్రైలర్.. దానితో పాటే డిసెంబర్ 2 న అఖండ రిలీజ్ డేట్ కూడా వచ్చేస్తుంది అంటూ ఖుషి అవుతున్నారు బాలయ్య ఫాన్స్.