Advertisementt

నాని అస్సలు మొహమాట పడలేదు

Sat 13th Nov 2021 05:18 PM
unstoppable,aha ott,unstoppable with nbk,nani,nandamuri balakrishna  నాని అస్సలు మొహమాట పడలేదు
Unstoppable With NBK Episode 2 highlights నాని అస్సలు మొహమాట పడలేదు
Advertisement
Ads by CJ

బాలకృష్ణ ఆహా ఓటిటి అన్ స్టాపబుల్ టాక్ షో కి ఫస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్ గా మంచు మోహన్ బాబు హాజరవగా.. సెకండ్ ఎపిసోడ్ కి హీరో నాని హాజరయ్యాడు. బాలకృష్ణ స్టైల్, బాలయ్య స్మైల్, ఆ రాజసం, ఆయన చేసే అల్లరి అన్ని అన్ స్టాపబుల్ టాక్ షో కి మెయిన్ హైలెట్స్ గా నిలుస్తున్నాయి. ఇక తాజాగా ఆహా ఓటిటి నుండి స్ట్రీమింగ్ లోకి వచ్చిన నాని - బాలయ్యల అన్ స్టాపబుల్ ఎపిసోడ్.. అందరిని ఆకట్టుకుంది.. నాని ఎంట్రీ, బాలయ్య తో నాని మాట్లాడిన తీరు.. బాలయ్యని ఓ క్యాన్సర్ పేషేంట్ తో సర్ ప్రైజ్ చేసిన తీరు అన్ని అద్భుతమే. నాని కూడా బాలయ్య తో చక్కగా మాట్లాడాడు.

ఇక నా సినిమాలలో నీకు నచ్చిన సినిమా, రాడ్ రంబోలా అనే సినిమా ఏదైనా ఉందా అని బాలయ్య అనగానే.. సర్ మీ సినిమాలో ఆదిత్య 369 అంటే చాలా ఇష్టం.. అలాగే పలనాటి బ్రహ్మనాయుడ అంటే ఇష్టం లేదు. మేము ఎన్నో అంచనాలు పెట్టుకుని వెళితే.. ఆ సినిమా నిరాశ పరిచింది. తొడకొడితే ట్రైన్ వెనక్కి వెళ్లడం ఏమిటో జీర్ణించుకోలేకపోయామంటూ అస్సలు మొహమాట పడకుండా నాని చెప్పడం.. దానికి బాలయ్య కూడా జస్ట్ కామెడీగా తీసుకుని ఎంజాయ్ చెయ్యడం అన్ని షో కి హైలెట్. నాని, బాలయ్య లు క్రికెట్ ఆడడం.. కెరీర్ ముచ్చట్లు, నాని ఇన్స్టా స్టోరీస్ ని చూసా అని బాలయ్య చెప్పడం, అలాగే బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ చెప్పడం, నాని తన సినిమాలో డైలాగ్ చెప్పడం అన్ని సెకండ్ ఎపిసోడ్ కి సూపర్ గా అనిపించాయి.

Unstoppable With NBK Episode 2 highlights :

Unstoppable With NBK and Nani Episode 2 highlights 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ