అల్లు అరవింద్ ఆహా ఓటిటీపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు అల్లు అరవింద్ అండ్ ఆహా టీం చాలానే ప్లాన్స్ చేస్తున్నారు. సెలెబ్రిటీ షోస్, అలాగే సమంత సామ్ జామ్ టాక్ షో, ఇంకా ప్రదీప్ మాచిరాజు సర్కార్ టాక్ షో, ఇంకా మంచు లక్షి హోస్ట్ గా వంటల ప్రోగ్రాం.. మధ్య మధ్యలో వెబ్ సీరియస్ హడావిడి.. తాజాగా నందమూరి బాలకృష్ణ తో అన్ స్టాపబుల్ టాక్ షో.. తో ఆహా ఓటిటిపై మంచి క్రేజ్ తీసుకొచ్చారు మేకర్స్. అయితే సమంత తో భారీ లెవల్లో చేసిన సామ్ జామ్ టాక్ ప్లాప్ అయ్యింది. చిరు, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య లాంటి గెస్ట్స్ లొచ్చినా సామ్ జామ్ షో హైలెట్ అవ్వలేదు.. సమంత టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్ నుండి ప్లాప్ గానే నిలిచింది.
కానీ బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో మాత్రం ఫస్ట్ ఎపిసోడ్ తోనే విపరీతమైన హైప్ క్రియేట్ చేసి అంచనాలు పెంచేసింది. మోహన్ బాబు ఫస్ట్ గెస్ట్ గా బాలయ్య అన్ స్టాపబుల్ కి రావడం.. ఆ ఎపిసోడ్ తో ఆ షో కి మంచి క్రేజ్ వచ్చేసింది. మోహన్ బాబు తో బాలయ్య ఆట, పాట, స్టేజ్ డాన్స్, బాలయ్య అల్లరి అన్ని హైలెట్ అవడంతో.. అన్ స్టాపబుల్ షోకి హిట్ టాక్ వచ్చేసింది. ఇక రీసెంట్ గా నాని తో సెకండ్ ఎపిసోడ్ ప్రీమియర్ అవుతుంది. నాని తో బాలకృష్ణ చిన్న పిల్లవాడి మాదిరి చేసిన అల్లరి, ఆయన ఎనెర్జీ, బాలయ్య స్టయిల్, స్మైల్, మధ్య మధ్యలో జోక్స్ అన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి.. బాలయ్య వాక్చాతుర్యంలో తడబడినా.. ఎడిటింగ్ టీం మంచిగా కవర్ చేసింది. మరి సామ్ జామ్ అంటూ టాప్ హీరోయిన్ వల్ల కానిది.. అన్ స్టాపబుల్ అంటూ బాలయ్య ఇరగదీసేస్తున్నారు.