Advertisementt
CJ Ads

రాధేశ్యామ్ అప్ డేట్ వచ్చేసింది

Sat 13th Nov 2021 11:33 AM
radhe shyam,radhe shyam first single,prabhas,manan bharadwaj,mithoon,and aman malik,pooja hegde,manan bharadwaj,mithoon,aman malik  రాధేశ్యామ్ అప్ డేట్ వచ్చేసింది
Radhe Shyam first single treat finalized రాధేశ్యామ్ అప్ డేట్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

ప్రభాస్ - పూజ హెగ్డే కాంబోలో రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న రాధేశ్యామ్ మూవీ ప్రమోషన్స్ విషయంలో ప్రభాస్ ఫాన్స్ రాధేశ్యామ్ నిర్మాతలు యువి క్రియేషన్స్ పై ఫైర్ అవుతున్నారు. అప్ డేట్స్ ఇవ్వరు.. రిలీజ్ డేట్ వచ్చేస్తుంది.. అటు చూస్తూ ఆర్.ఆర్.ఆర్, పుష్ప పాన్ ఇండియా ప్రమోషన్స్ జోరులో ఫాన్స్ మునిగి తేలుతున్నారంటూ ప్రభాస్ ఫాన్స్ యువి వారిని తిట్టి పోస్తున్నారు. అయితే సంక్రాంతి టార్గెట్ గా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ టీం.. పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా వుంది.. ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసారు. అది కొద్దిగా లేట్ గా. తాజాగా రాధేశ్యామ్ నుండి బిగ్ అప్ డేట్ వచ్చేసింది.

రాధేశ్యామ్ నుండి నవంబర్ 15 సాయంత్రం 5 గంటలకి ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్టుగా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఇప్పటికే సోషల్ మీడియాలో రాధేశ్యామ్ అప్ డేట్ నవంబర్ 15 నే అంటూ ప్రభాస్ ఫాన్స్ గత రెండు రోజులుగా రాధేశ్యామ్ హాష్ టాగ్ ట్రెండ్ చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. ఇక రాధేశ్యామ్ రిలీజ్ వరకు ఆ సినిమా ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ క్రియేట్ చెయ్యాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.. సో ఇకపై రాధేశ్యామ్ ప్రమోషన్స్ హడావిడి తో సోషల్ మీడియా నిండిపోతుందన్నమాట.

Radhe Shyam first single treat finalized:

Prabhas Radhe Shyam first single treat finalized

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ