మహానటి తో టాప్ లో ఉన్న కీర్తి సురేష్.. ఆతర్వాత చాలా రోజులు పాటు వెయిట్ లాస్ అవడం కోసం స్పెండ్ చేసింది. మహానటి తర్వాత మూడేళ్ళ గ్యాప్ తో మళ్ళీ మహేష్ తో సర్కారు వారి పాటలో నటిస్తుంది. మధ్యలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తో పెద్దగా సత్తా చాటలేకపోయిన కీర్తి సురేష్.. ప్రస్తుతం పలు బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గానూ, సర్కారు వారి పాట సినిమాతో క్రేజీ గా మారింది. అయితే హీరోయిన్ గా మళ్ళి స్టార్ అవకాశాలు వస్తున్న టైం లో కీర్తి సురేష్ చిరంజీవి కి చెల్లెలి గా భోళా శంకర్ లో నటించడం ఆమె ఫాన్స్ కి షాకిచ్చింది. హీరోయిన్ గా క్రేజీ ఆఫర్స్ తో ముందుకు వెళ్లాల్సిన కీర్తి సురేష్ ఇలా చిరు చెల్లి పాత్రలో కనిపించడం ఎవరికీ ఇష్టం లేదు.
ఇక ఈ గురువారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా మొదలైన భోళా శంకర్ ముహూర్తపు సన్నివేశాల కోసం కీర్తి సురేష్ రాలేదు.. అయితే ఈ సినిమాకి కీర్తి సురేష్ అదిరిపోయే పారితోషకం అందుకుంటుంది అని తెలుస్తుంది. చెల్లెలి కేరెక్టర్ చేసినందుకు గాను.. కీర్తి సురేష్ కి మేకర్స్ 2 కోట్లు ముట్ట జెబుతున్నారనే టాక్ రేజ్ అయ్యింది. మెహెర్ 2 కోట్లతో కీర్తి సురేష్ ని పడేసాడని, అందుకే కీర్తి సురేష్ కూడా ఒప్పుకుంది అని.. ఎలాగూ సినిమా మొత్తం చెల్లి కేరెక్టర్ చుట్టూనే తిరుగుతుంది కాబట్టి.. మెయిన్ లీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది హీరోయిన్ కేరెక్టర్ అయితే ఏమిటి, చెల్లి కేరెక్టర్ అయితే ఏమిటి అన్నట్టుగా కీర్తి సురేష్ ఈ సినిమా ఒప్పేసుకుంది అని అంటున్నారు.