బిగ్ బాస్ సీజన్ లోకి టైటిల్ ఫెవరెట్ గా దిగిన యాంకర్ రవి.. హౌస్ లో అక్కడి మాటలు ఇక్కడి మాటలు అక్కడ, గేమ్ స్ట్రాటజీ అంటూ ఇంఫ్లుయెన్స్ చేస్తూ.. మాటిమాటికి నాగార్జునకి దొరికిపోతూ తిట్లు తినేవాడు.. ఒకొనొక సమయంలో రవి ఏమిటి టైటిల్ ఫెవరేట్ అనుకున్నారు. మళ్ళీ రెండు వారాలుగా రవి యాక్టీవ్ గా మారిపోయాడు. ఇక హౌస్ లోకి అడుగుపెట్టినప్పటినుండి.. కెప్టెన్ అవ్వడం కోసం రవి ట్రై చేస్తున్నాడు. నటరాజ్ మాస్టర్ లాంటివాళ్లు గుంటనక్క అన్నా.. రవి అవేమి మనసులోకి రానివ్వకుండా టాస్క్ లు ఆడుతున్నాడు. ఇక తాజాగా BB హోటల్ టాస్క్ లో రవికి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు.
అందులో హోటల్ కి వచ్చిన అతిధులకు కష్టపెట్టే పనులతో రవి సీక్రెట్ టాస్క్ గెలిచాడు. ఇక కెప్టెన్సీ టాస్క్ కి ఎంపికైన సిరి, షణ్ముఖ్, సన్నీ లని దాటుకుని రవి ఈ వారం కెప్టెన్ గా నిలిచాడని తెలుస్తుంది. ఇక వరెస్ట్ పెరఫార్మెర్ గా హౌస్ లోని ఎక్కువ శాతం ఓట్స్ సిరికి పడగా.. ఆమె ని ఈ వారం జైలు కి పంపినట్లుగా తెలుస్తుంది. BB హోటల్ టాస్క్ లో సిరి సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదని.. షణ్ముఖ్ చుట్టూనే తిరుగుతూ, పని అందరితో చేయించుకుని టిప్స్ కూడా షణ్ముఖ్ కి ఒక్కడికే ఇచ్చిందని.. హౌస్ మొత్తం సిరిని వరెస్ట్ పెరఫార్మెర్ గా డిసైడ్ చేసినట్లుగా తెలుస్తుంది. బెస్ట్ పెర్ఫార్మర్ గా సన్నీ నిలిచినట్లుగా తెలుస్తుంది.