మెగాస్టార్ చిరు ఇంటి కోడలు, మెగా ఫ్యామిలీ కోడలు, రామ్ చరణ్ వైఫ్ ఉపాసన.. అంటే తెలియని వారుండరు. అటు అపోలో హాస్పిటల్ పనులు, ఇటు మెగా కోడలిగా బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తిస్తున్న ఉపాసన.. అమ్మాయిలకి రోల్ మోడల్ అనేలా ఉంటుంది. రామ్ చరణ్ తో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ తాను నిర్వర్తించాల్సిన బాధ్యలను పర్ఫెక్ట్ గా చక్కబెడుతుంది. అయితే రామ్ చరణ్ తో పాటుగా పెళ్లిళ్లు చేసుకున్న ఎన్టీఆర్, బన్నీ లు ఇద్దరిద్దరి పిల్లని కన్నారు. కానీ రామ్ చరణ్ - ఉపాసనకు పెళ్ళై ఎనిమిదేళ్ళయినా ఇంకా పిల్లలు లేరు.. కారణాలు ఏమిటనేది ఎవరికీ తెలియదు. అప్పుడప్పుడు చరణ్ అండ్ ఉపాసనలకు ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి.
తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసనని పిల్లల విషయమై ప్రశ్న అడగగా.. దానికి ఉపాసన కొంచెం సీరియస్ అయ్యింది. అది నా వ్యక్తి గత విషయమని, ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా ఎక్కువచేసి చూపిస్తుందని.. వాటన్నిటీకి తానూ జవాబు చెప్పాల్సిన అవసరం నాకులేదు. నేను మాత్రం దీనికి సమాధానం చెప్పను.. ఆ సమయం వచ్చినప్పుడు గుడ్ న్యూస్ నేనే చెబుతాను అని చెప్పింది. ఇక రామ్ చరణ్ తో సెట్స్ లో వేరే హీరోయిన్స్ రొమాన్స్ చేస్తున్నప్పుడు జెలస్ ఫీలవుతారా అనగానే.. నేనూ మనిషినే కదా, అమ్మాయినే కదా.. నాకు జెలస్ ఉంటుంది అని చెప్పింది.