Advertisementt

బిగ్ బాస్ 5: షణ్ముఖ్ vs సన్నీ రెచ్చిపోయారుగా

Fri 12th Nov 2021 11:39 AM
bigg boss 5,bigg boss telugu,priyanka fires,ravi,shanmukh,anee mater,sriram chandra  బిగ్ బాస్ 5: షణ్ముఖ్ vs సన్నీ రెచ్చిపోయారుగా
Bigg Boss 5: Shanmukh vs Sunny బిగ్ బాస్ 5: షణ్ముఖ్ vs సన్నీ రెచ్చిపోయారుగా
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 లో ట్రాన్స్ జెండర్ గా ఎంట్రీ ఇచ్చిన పింకి అలియాస్ ప్రియాంక.. తొమ్మిదివారాల వరకు గ్లామర్ గా రెడీ అవుతూ.. మానస్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ బాగానే కవర్ చేసింది. నామినేషన్స్ లో తనకి ఓట్ చేసే వారిపై ఎగురుతూ.. చెత్త రీజన్స్ చెప్పి నన్ను నామినేట్ చెయ్యకండి అంటూ ఫైర్ అయ్యే ప్రియాంక బిగ్ బాస్ హౌస్ లో మరోసారి కోపం తెచ్చుకుంది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో బీబీ హోటల్ టాస్క్ జరిగింది. అందులో మానస్ అండ్ ప్రియాంక లు హాని మూన్ కపుల్ గా కనిపించారు. అయితే టాస్క్ గెలిచిన హోటల్ టీం.. సన్నీ, మానస్, సిరి, కాజల్, మానస్, ప్రియాంకలలో ఇద్దరినీ కెప్టెన్సీ టాస్క్ కి అనర్హులుగా చెప్పమని చెప్పడంతో..

ఆని మాస్టర్, షణ్ముఖ్, శ్రీరామ చంద్ర, రవి కలిసి గ్రూప్ గా డిస్కర్షన్ చేసి.. మానస్ ఇంకా ప్రియాంక లను కెప్టెన్సీ టాస్క్ కి అనర్హులుగా అనుకున్నామని ఆని మాస్టర్ చెప్పగానే ప్రియాంక తెగ ఫైర్ అయ్యింది. ఎప్పుడు ఎక్కువగా రెడీ అవుతూ టైం కి రావడం లేదనే రీజన్ తో ప్రియాంక ని నామినేట్ చెయ్యగా.. దానికి ప్రతిసారి రెడీ అయ్యి రెడీ అంటున్నారు.. నేనేమన్నా ఇది చేస్తున్నానా.. అదొక రీజనా.. చెత్త రీజన్ అంటూ లేచి వెళ్ళిపోయింది.. మరి ఈ రోజు ఎపిసోడ్ లో ప్రియాంక కంటెస్టెంట్స్ తో బాగానే గొడవ పడేలా కనబడుతుంది..

 తాజా ప్రోమో చూస్తే.. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో పార్టిసిపేట్ చేస్తున్న సన్నీ కి సిరికి, షణ్ముఖ్ మధ్యన పెద్ద గొడవే జరిగింది. సిరి - సన్నీ గొడవ పడుతుండగా.. షన్ను మధ్యలోకి వెళ్ళగానే సన్నీ ఫైర్ అయ్యాడు.. అప్పడం చేస్తాను అని సన్నీ అనగానే.. షణ్ముఖ్.. కూడా అదే స్థాయిలో కొడతావా కొట్టు అంటూ గొడవ పడ్డాడు.. ఆడపిల్లని అడ్డం పెట్టుకుని గేమ్ ఆడుతున్నావ్ అని సన్నీ అనగానే షణ్ముఖ్ మరింతగా రెచ్చిపోయాడు.. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు మాట్లాడితే అని షన్ను అనగానే నీకేమిట్రా రెస్పెక్ట్ ఇచ్చేది అని సన్నీ అన్నాడు. అప్పడం అంటే నేను వస్తాను అన్నాడు షన్ను.. సన్నీ - షణ్ముఖ్ మధ్యలో పెద్ద గొడవే జరిగింది. మరి ఏ ఈరోజు ఎపిసోడ్ లో ఈ గొడవే హైలెట్ అయ్యేలా ఉంది. 

Bigg Boss 5: Shanmukh vs Sunny:

Bigg Boss 5: Priyanka fires on Ravi, Shanmukh, Anee Mater and Sriram chandra 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ