విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన పుష్పక విమానం సినిమా నేడు థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ దేవరకొండ తన లైగర్ సినిమా షూటింగ్ ని కూడా పక్కనబెట్టి పుష్పక విమానం సినిమా ని గట్టిగా ప్రమోట్ చేసాడు. తమ్ముడి సినిమా బాధ్యతని నెట్టి మీద వేసుకున్నాడు. ఎందుకంటే విజయ్ దీనికి నిర్మాత కూడా.. అలా అన్నదమ్ములు పుష్పక విమానం సినిమాకి ఓ రేంజ్ ప్రమోషన్స్ తో అందరిలో ఆశక్తిని క్రియేట్ చేసారు. భారీ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందు వచ్చిన పుష్పక విమానం సినిమా కి ప్రేక్షకులు సోషల్ మీడియా లో ఇలా ఉంది.. అలా ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు.. ఆ సోషల్ మీడియా టాక్ మీ కోసం
ఆనంద్ దేవరకొండ ఈ చిత్రంలో చిట్టి లంక సుందర్ పాత్రలో కనిపించాడు.. చిట్టి లంక సుందర్ కి సుందర్ కి మీనాక్షి అనే అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగిన కొద్దిరోజులకే ఆ అమ్మయి లేచిపోతుంది. పెళ్ళాం లేచిపోయింది అనే విషయం తెలియకుండా చిట్టి లంక సుందర్ తెగ కష్టపడతాడు. భార్య లేచిపోయింది అంటే పరువు పోతుంది అనుకుకుంటాడు. ఫస్ట్ హాఫ్ లో కథ పెద్దగా ఏమీ ఉండదు కానీ భార్య మిస్సయ్యిందనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుందని, సెకండ్ హాఫ్ లో కథ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి మారుతుంది. ఇక సునీల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ చాలా స్లోగా మారిపోయింది అని.. ఈ సినిమాకి ప్రేక్షకులు మిక్స్డ్ టాక్ ఇస్తున్నారు.. కొంతమంది యావరేజ్ అంటుంటే.. కొంతమంది బావుంది అని, స్క్రీన్ ప్లే హైలెట్ అని, ఆనంద్ దేవరకొండ చిట్టి లంక సుందర్ గా అద్భుతంగా నటించాడని అంటున్నారు. ఇది పుష్పక విమానం సోషల్ మీడియా టాక్.