ఎప్పుడో మే నెలలో విడుదల కావాల్సిన ఆచార్య మూవీ, ఖిలాడీ మూవీ లు సెకండ్ వేవ్.. మధ్యలో చిన్న చిన్న సమస్యలతో.. ఇప్పుడు ఆ సినిమాలు ఏకంగా వచ్చే ఏడాది ఫిబ్రవరికి రిలీజ్ డేట్స్ మార్చుకున్నాయి. దానితో చిరు అండ్ రవితేజ ఫాన్స్ బాగా ఫీలయ్యారు. డిసెంబర్ లో రిలీజ్ ఉంటుంది అనుకున్న ఆచార్య ఫిబ్రవరి 4 న, డిసెంబర్ నెలాఖరున క్రిష్టమస్ స్పెషల్ గా విడుదల అవుతుంది అనుకున్న ఖిలాడీ మూవీ ఫిబ్రవరి 11 కి వెళ్లిపోవడంతో.. ఇప్పడు నందమూరి ఫాన్స్ కి టెంక్షన్స్ స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే అఖండ మూవీ కి ఇంత వరకు డేట్ ఇవ్వలేదు. ప్రస్తుతం అఖండ మూవీ డిసెంబర్ 2 న విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
డిసెంబర్ 2 న అఖండ మూవీ, నవంబర్ 15 న అఖండ మూవీ ట్రైలర్ రిలీజ్ కి డేట్స్ ఫిక్స్ అయ్యాయి అంటున్నారు.. కానీ ఇప్పుడు ఆచార్య, ఖిలాడీ మూవీ చూసాక బాలయ్య ఫాన్స్ కంగారు పడుతున్నారు. అఖండ మూవీ రిలీజ్ డేట్ కూడా ఎక్కడ వచ్చే ఏడాదికి వెళ్లిపోతుందో అని ఇప్పుడు వాళ్ళు టెంక్షన్ లో ఉన్నారు. నిజంగానే అఖండ మేకర్స్ కూడా బాలయ్య ఫాన్స్ కి షాకిస్తూ అఖండ మూవీ ని వచ్చే ఏడాదికి మార్చేయ్యారు కదా..