Advertisementt

దృశ్యం 2 అప్ డేట్ వచ్చేస్తుంది

Thu 11th Nov 2021 07:41 PM
venkatesh,drushyam 2,venkatesh drushyam 2 movie,drushyam 2 update,meena,jeetu josef  దృశ్యం 2 అప్ డేట్ వచ్చేస్తుంది
Drushyam 2 update tomorrow దృశ్యం 2 అప్ డేట్ వచ్చేస్తుంది
Advertisement
Ads by CJ

మలయాళంలో మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 అక్కడ బ్లాక్ బస్టర్ అవడంతో.. ఇక్కడ తెలుగులో వెంకటేష్ మోహన్ లాల్ దృశ్యం 2 ని రీమేక్ చేసారు. ఒరిజినల్ దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగులో కూడా దృశ్యం 2 మూవీని తెరకెక్కించారు. అయితే సినిమా షూటింగ్ ఎప్పుడో మార్చి లో ఫినిష్ అయ్యింది.. నెల క్రితమే దృశ్యం 2 ఫైనల్ కాపీ రెడీ అయ్యింది. ఆఖరికి సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న దృశ్యం 2 రిలీజ్ డేట్ విషయంలో ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారో కానీ ఇంతవరకు దృశ్యం 2 డేట్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. 

అసలు దృశ్యం 2 మొదట్లో చెప్పినట్టుగా ఓటిటినా లేదంటే.. థియేటర్స్ లో రిలీజ్ చేస్తారా అనేది కూడా తెలియడం లేదు. ఓటిటి అని ముందే కమిట్ అయిన సురేష్ బాబు దృశ్యం 2 ని ఓటిటిలో రిలీజ్ చేస్తారా.. లేదంటే థియేటర్స్ లోనా అనేది తెలియాల్సి ఉండగా.. వెంకీ ఫాన్స్ మాత్రం దృశ్యం 2 అప్ డేట్ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా దృశ్యం 2 నుండి అప్ డేట్ కి టైం ఫిక్స్ చేసారు, రేపు మధ్యాన్నం 12 గంటలకు దృశ్యం 2 అప్ డేట్ అంటూ మేకర్స్ ప్రకటించారు. The update everyone has been waiting for...Victory @VenkyMama's much anticipated film #Drushyam2 update tomorrow at 12.00PM. ❤️ 💥.. అంటూ ట్వీట్ చేసారు. 

మరి ఆప్ డేట్ అంటే.. రిలీజ్ డేట్ ఇస్తారా.. లేదంటే ట్రైలర్ అనౌన్సమెంట్ ఎమన్నా ఉంటుందా.. అని వెంకీ ఫాన్స్ ఆతృతగా ఉన్నారు. ఇక ఈ ఏడాది నారప్ప తో వెంకటేష్ ఓటిటి నుండి ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టడంతో.. ఇప్పుడు ఈ దృశ్యం 2 పై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ప్రస్తుతం వెంకటేష్ F3 మూవీ షూటింగ్ లో జోరుగా పాల్గొంటున్నారు. 

Drushyam 2 update tomorrow :

Venkatesh Drushyam 2 update tomorrow at 12.00PM

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ