ఎన్నడూ లేని విధంగా ప్రభాస్ సూపర్ ఫాస్ట్ గా దూసుకుపోతున్నాడు. రాధేశ్యామ్ రిలీజ్ కి సిద్ధం చేస్తూ.. ముంబై లో ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ షూటింగ్ ని పరిగెత్తించాడు. అంతేకాదు.. ఆదిపురుష్ షూటింగ్ ని కూడా అదే స్పీడు లో ముగించేశాడు. రామాయణాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కుతోన్న ఆదిపురుష్ చిత్రీకరణ పూర్తయిన విషయాన్ని ఓంరౌత్ ఓ ఫొటో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రభాస్, జానకి పాత్రధారి కృతి సనన్, రావణ్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్, ఓంరౌత్ లు ఆ పిక్ లో ఉన్నారు. అంతేకాకుండా ఆదిపురుష్ షూట్ చిత్రీకరణ 103 రోజుల్లో ముగిసింది. ఓ అద్భుతమైన ప్రయాణం గమ్యస్థానానికి చేరుకుంది. మేము క్రియేట్ చేసిన మేజిక్‌ని మీతో పంచుకోవడం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను అంటూ పోస్ట్ చేసాడు ఓం రౌత్
మరి భారీ బడ్జెట్ తోనే 3D లో తెరకెక్కిన ఈ సినిమా లో మెయిన్ గా విజువల్ ఎఫెక్ట్స్ కీ రోల్ పోషించనున్నాయి. సినిమాలో సగ భాగం ఈ గ్రాఫిక్స్ కే ప్రాధాన్యత ఉంది. ఆదిపురుష్ గ్రాఫిక్స్ కోసమే వందల కోట్లు వెచ్చించారు. ఆగస్టు 2022 లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఆదిపురుష్ చిత్రీకరణను పూర్తి చేసిన ప్రభాస్ సలార్ షూటింగ్ కి జంప్ అవ్వబోతున్నారు. ఇక ఆదిపురుష్ షూటింగ్ పూర్తయ్యింది.. ప్రభాస్ ఫస్ట్ లుక్ పై ఇప్పటికైనా ఓం రౌత్ క్లారిటీ ఇస్తారో,, లేదో.. అనే అతృతతో ప్రభాస్ ఫాన్స్ ఉన్నారు. తమ రాముడిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని.