బాలకృష్ణ - బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కిన అఖండ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవడం.. టీం ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీ అవడం చూసాం. అఖండ టీజర్, పోస్టర్స్, సాంగ్స్ అన్ని ఫాన్స్ కే కాదు సాధారణ ప్రేక్షకుడికి బాగా ఎక్కేశాయి. అఖండ పై మార్కెట్ లో విపరీతమైన బజ్ ఉంది. అయితే భారీ అంచనాలున్న అఖండ మూవీ రిలీజ్ డేట్ విషయంపై సస్పెన్స్ వీడడం లేదు. ఇదిగో అదిగో అనడమే కానీ.. అఖండ మేకర్స్ నుండి మాత్రం రిలీజ్ డేట్ బయటికి రావడం లేదు. అయితే తాజాగా అఖండ సినిమా రిలీజ్ డేట్, ట్రైలర్ రిలీజ్ డేట్స్ ఇవే అంటూ సోషల్ మీడియాలో రెండు డేట్స్ ప్రచారంలోకి వచ్చాయి.
అవి అఖండ మూవీ ట్రైలర్ నవంబర్ 15 న అని, సినిమా రిలీజ్ డిసెంబర్ 2 అంటూ అఖండ రిలీజ్ డేట్ పై ఓ న్యూస్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి మేకర్స్ కూడా డిసెంబర్ 2 నే చూజ్ చేసుకుంటారో లేదంటే.. వేరే డేట్ ఇస్తారో కానీ.. ప్రెజెంట్ అయితే అఖండ రిలీజ్ డేట్ డిసెంబర్ 2 అంటున్నారు. రేపో మాపో అఖండ మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది అంటున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీకాంత్ పవర్ ఫుల్ విలన్ గా నటించగా.. ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటించారు.