Advertisementt

NBK107 నుండి ఫాన్స్ కి సడన్ సర్ ప్రైజ్

Wed 10th Nov 2021 05:46 PM
nandamuri balakrishna,gopichand malineni,mythri movie makers,nbk107,nbk107 grand opening,november 13,shruthi hasan  NBK107 నుండి ఫాన్స్ కి సడన్ సర్ ప్రైజ్
Nandamuri Balakrishna NBK107 Grand Opening On.. NBK107 నుండి ఫాన్స్ కి సడన్ సర్ ప్రైజ్
Advertisement
Ads by CJ

బాలయ్య - బోయపాటి కాంబో .. అఖండ మూవీ ప్రేక్షకులముందుకు రావడానికి రెడీ అవుతుంటే.. బాలకృష్ణ ఆహా ఓటిటి కోసం అన్ స్టాపబుల్ టాక్ షో తో అదరగొట్టేస్తున్నారు. ఇక బాలయ్య తదుపరి మూవీ అప్ డేట్ కోసం ఫాన్స్ వెయిటింగ్ లో ఉన్నారు. అనుకోకుండా NBK107 మేకర్స్.. నందమూరి ఫాన్స్ కి సడన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. 

నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మాస్‌లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. ఇక మాస్ పల్స్ తెలిసిన గోపీచంద్ మలినేని వంటి డైరెక్టర్‌తో బాలకృష్ణ సినిమా అంటే అందరిలోనూ అంచనాలు ఆకాశన్నంటుతాయి. క్రాక్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన గోపీచంద్ మలినేని.. బాలకృష్ణ సినిమా కోసం అద్భుతమైన కథను సిద్దం చేశాడు. వాస్తవ ఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ కథను రాశారు.

పుల్ మాస్ మసాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ఈ మూవీ ప్రారంభోత్సవం నవంబర్ 13, ఉదయం 10:26 గంటలకు ఘనంగా జరగనుంది.

బాలకృష్ష సరసన శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు వెల్లడించనున్నారు.

అఖండ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్, రిలీజ్ పనులన్నీ ముగిసిన తరువాత ఈ NBK107 ప్రాజెక్ట్‌ రెగ్యులర్ షూట్ లోకి అడుగు పెట్టనున్నారు నందమూరి బాలకృష్ణ.

Nandamuri Balakrishna NBK107 Grand Opening On..:

Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers NBK107 Grand Opening On November 13

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ