Advertisementt

వచ్చేసింది ఆర్.ఆర్.ఆర్ మాస్‌ ఆంథమ్‌

Wed 10th Nov 2021 03:34 PM
rrr,rrr pan india movie,ntr with ram charan,ram charan as alluri sita ramaraju,komaram bheem as ntr,rajamouli,jakkanna,ntr rrr movie,ram charan rrr movie,rajamouli rrr,d.v.v danayya,dvv entertainment,rrr movie naatu naatu song,rrr mass anthem  వచ్చేసింది ఆర్.ఆర్.ఆర్ మాస్‌ ఆంథమ్‌
RRR Mass Anthem from RRR Movie out now వచ్చేసింది ఆర్.ఆర్.ఆర్ మాస్‌ ఆంథమ్‌
Advertisement
Ads by CJ

రాజమౌళి - ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలయికలో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ నుండి ఎలాంటి అప్ డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక గత నాలుగైదు రోజులుగా ఆర్.ఆర్.ఆర్ నుండి నాటు నాటు అనే ఊరమాస్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ చెప్పినప్పటినుండి.. ఆ సాంగ్ పై అంచనాలు పెరిగిపోయాయి.. స్టార్ హీరోస్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ లు వేరు వేరుగా స్క్రీన్ మీద డాన్స్ చేస్తేనే పూనకాలు తెచ్చుకునే ఫాన్స్.. ఇప్పుడు ఒకే స్క్రీన్ మీద ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ లు డాన్స్ చెయ్యడం.. అది కూడా ఊర మాస్ స్టెప్స్ వెయ్యడం చూస్తే ఫాన్స్ ఆగుతారా.. అందుకే నాటు నాటు సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని ఎదురు చూస్తున్నారు.

ఈ రోజు బుధవారం నవంబర్ 10 సాయంత్రం నాలుగు గంటలకి రిలీజ్ చెయ్యాల్సిన ఆర్.ఆర్.ఆర్ సాంగ్ ఓ గంట ముందుగానే వచ్చేసి ఫాన్స్ ని సూప్ సర్ ప్రైజ్ చేసింది. నా పాట సూడు.. నా పాట సూడు.. వీర నాటు నాటు..అంటూ సాగే ఈపాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఊర మాస్ స్టెప్స్ కి ఫాన్స్ కి పూనకాలే అనేలా ఉన్నాయి. మామూలుగానే చరణ్, ఎన్టీఆర్ లు భీభత్సమైన డాన్సర్స్. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా కి సరిపోయే డాన్స్ స్టెప్స్ తో అదరగొట్టేసాడు ఈ హీరోలిద్దరూ.. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ నుండి రిలీజ్ అయిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సాంగ్ కి కీరవాణి మ్యూజిక్ అందించగా, చంద్రబోస్‌ ఈ పాటని రాసారు.. రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ కలిసి ఈ పాట పాడారు.

RRR Mass Anthem from RRR Movie out now:

RRR Movie Naatu Naatu song out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ