అనసూయ.. గ్లామర్ యాంకర్. అనసూయ అంటేనే గ్లామర్, గ్లామర్ అంటేనే అనసూయ. అందం తో పాటు.. అనసూయ కి పవర్ ఫుల్ ఐస్, వాయిస్ ఆమెకి ప్లస్ పాయింట్స్. అందుకే గ్లామర్ ప్రపంచంలో పెళ్లి అయ్యాక కూడా దూసుకుపోతుంది. ప్రస్తుతం జబర్దస్త్ షో, మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్స్ లో యాంకర్ గా దున్నేస్తుంది. ఇక మరోవైపు సినిమాల్లోనూ అనసూయ అదరగొట్టేస్తుంది. పుష్ప నుండి అనసూయ లుక్ దాక్షాయణి లుక్ వచ్చేసింది. ఖిలాడీ మూవీ లో రవితేజ తో ఢీ కొట్టబోతుంది. ఇంకా చిరు గాడ్ ఫాదర్ లోను అనసూయ కీ రోల్ చేస్తుంది.. సో ఇలా అనసూయ క్రేజ్ మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం కి పనికొస్తుంది అని ఈవెంట్ నిర్వాహకులు అనుకున్నారు.
కానీ తేడా కొట్టింది. తమన్నా ఉన్నప్పుడు మాస్టర్ చెఫ్ కి ఎలాంటి ఆదరణ ఉందో.. అనసూయ వచ్చాక కూడా మాస్టర్ చెఫ్ కి అదే టీఆర్పీ రావడంతో మాస్టర్ చెఫ్ నిర్వాహకులు షాకవుతున్నారట.
తమన్నా తో లెక్కలు సరి లేక ఆమెని తప్పించి గ్లామర్ ప్రపంచంలో నెంబర్ వన్ అనసూయ ని తీసుకొచ్చి హోస్ట్ గా పెట్టారు. అనసూయ యాంకరింగ్ బావుంది.. మాస్టర్ చెఫ్ ఈవెంట్ కి కొత్త అందం వచ్చింది.. అంతా బాగానే ఉంది.. కానీ తమన్నా ఉన్నప్పుడు మాస్టర్ చెఫ్ ఈవెంట్ కి ఎలాంటి టీఆర్పీ ఉందో.. అదే టీఆర్పీ అనసూయ వచ్చాక కూడా ఉంటుంది అని.. అనసూయ కూడా మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం ని లేపలేకపోతుంది అంటున్నారు.