రంగస్థలం లో రంగమ్మత్తగా సుకుమార్ యాంకర్ అనసూయ కి అద్భుతమైన కేరెక్టర్ ఇచ్చి.. అనసూయలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు.. ఇప్పుడు పుష్ప పాన్ ఇండియా మూవీలో దాక్షాయనిగా సరికొత్తగా చూపించబోతున్నారు. నోట్లో ఆకు నములుతూ.. చేతిలో అడకత్తెర పట్టుకుని పోకచెక్కలు పగల గొడతూ అనసూయ ఇచ్చిన లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పోస్టర్ లో ఉన్న ఇంపాక్ట్ కంటే.. సినిమాలో అనసూయ క్యారెక్టర్ 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్.
అప్పుడు రంగమ్మత్త.. ఇప్పుడు దాక్షాయణి గా అనసూయ దుమ్మురేపుతోంది. అల్లు అర్జున్ - రష్మిక కాంబోలో సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప పాన్ ఇండియా ఫిలిం డిసెంబర్ 17 న రిలీజ్ కి సిద్ధమవుతుంటే... మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసారు. పుష్ప సాంగ్స్ తో పాటుగా.. సినిమాలో కీలకమైన కేరెక్టర్స్ ని, అనసూయ, విలన్ ఫహద్ ఫాజిల్ ల లుక్స్ రివీల్ చెయ్యగా.. అన్ని లుక్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.