Advertisementt

RC15 లో రామ్ చరణ్ అలా

Tue 09th Nov 2021 10:05 PM
ram charan,shankar,rc15,cbi officer in rc15,kiara advani,dil raju,anjali,srikanth  RC15 లో రామ్ చరణ్ అలా
Ram Charan To Play JD Lakshmi Narayana? RC15 లో రామ్ చరణ్ అలా
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్, ఆచార్య మూవీస్ షూటింగ్స్ ఫినిష్ చేసి రిలాక్స్ అవ్వడం లేదు.. కోలీవుడ్ డైరెక్టర్ తో RC15 షూటింగ్ కోసం ఓ 12 రోజుల పాటు పూణే వెళ్ళొచ్చాడు. RC15 ఓ సాంగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని వచ్చిన రామ్ చరణ్ నేరుగా బెంగుళూర్ వెళ్లి పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీని, ఆయన సమాధిని సందర్శించి వచ్చారు. ఇక మెగా ఫ్యామిలీ దివాళి పార్టీ హోస్ట్ తర్వాత రామ్ చరణ్ ఇక ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ కోసం రెడీ కాబోతున్నారు. అయితే రామ్ చరణ్ RC15 లో పవర్ ఫుల్ సిబిఐ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని ప్రచారం జరగడమే కాదు.. శంకర్ ఓపెనింగ్ పోస్టర్ లో రామ్ చరణ్ కి కోటు, సూటు వేసి చేతికి సూట్ కేస్ కూడా ఇవ్వడంతో అందరూ అదే రోల్ రామ్ చరణ్ ప్లే చేస్తున్నాడని ఫిక్స్ అయ్యారు.

అయితే రామ్ చరణ్ పవర్ ఫుల్ సీబీఐ ఆఫీసర్ గా అంటే రియల్ గా సిబిఐ ఆఫీసర్ జెడి లక్ష్మి నారాయణ కేరెక్టర్ లాంటి కేరెక్టర్ చేయబోతున్నాడని టాక్. జేడీ లక్ష్మి నారాయణ అంటే తెలియని వారుండరు. ఆయన ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ సీఎం అవ్వకముందు, బళ్లారి గాలి జనార్దన్ రెడ్డి కేసులో హీరో అయ్యారు. ఆయన అవినీతి రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించినట్టుగా రామ్ చరణ్ రోల్ RC15 లో ఉండబోతుంది అని.. చరణ్ సిబిఐ జెడి లక్ష్మి నారాయణ ఒరిజినల్ కేరెక్టర్ చెయ్యబోతున్నాడంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన క్రేజీ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తుంది. అలాగే శ్రీకాంత్, అంజలి లాంటి నటులు నటిస్తుండగా.. ఎస్.ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 

Ram Charan To Play JD Lakshmi Narayana? :

Ram Charan plays an CBI officer in RC15 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ