సమంత అక్కినేని ఇంటి కోడలవ్వక ముందే స్టార్ హీరోయిన్. పెళ్లి అయ్యాక కెరీర్ లో మరిన్ని హిట్స్ కొట్టింది. ఏమాయ చేసావే సినిమా దగ్గర నుండి మధ్యలో విజయాలు పజయాలను దాటుకుంటూ తనకంటూ ఇప్పటికీ మంచి క్రేజ్ ని సంపాదించుకున్న సమంత.. సీనియర్స్ లిస్ట్ లోకి వెళ్లకుండా జాగ్రత్తలు పడుతుంది. కాబట్టే పూజ హెగ్డే, రశ్మికలకు పోటీగా సినిమాలు చేస్తూ గ్లామర్ షో చేస్తుంది. నాగ చైతన్య తో పెళ్లి, విడాకులు తో ఈ మధ్యన బాగా పాపులర్ అయిన సమంత రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ని ఒప్పుకుంది. ఇక హిందీ ఫామిలీ మ్యాన్ 2 తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన సమంత.. అదే క్రేజ్ తో ఇప్పుడొక అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.
అది ఈ నెల 20 నుంచి 28 వరకు గోవా స్టేట్‌లో జరగునున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో పాల్గొనవలసిందిగా సమంతకి స్పెషల్ గా ఆహ్వానం అందింది. ఇప్పటివరకు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో చాలామంది సౌత్ హీరోయిన్స్ పాలొన్నా.. ఇంతవరకు వేదిక మీద మాట్లాడే అవకాశం మాత్రమే వారికి రాలేదు. కానీ సమంత ఫస్ట్ టైం ఆ వేదికపై మాట్లాడే అరుదైన గౌరవం అందుకుంది. అలాగే బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయ్‌ను ఈ వేడుకలో ప్రసంగించే వ్యక్తిగా ఎంపిక చేసింది. ఇంకా వీరితో పాటుగా ఈ ఈవెంట్‌కు ప్రముఖ డైరెక్టర్ అరుణా రాజే, నటుడు జాన్ ఎడతత్తిల్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిలకి ఆహ్వానం అందింది.